ఎందరో ప్రేమించారు కానీ...: నయనతార
|
అయితే ఓ విలేకరి ఆమెను ఇంటర్వ్యూ చేసే నిమిత్తం మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా అని గడుసుగా అడిగాడట. అందుకు నయనతార నన్ను చిన్న వయస్సులోనే చాలా మంది ప్రేమించారని అదిరిపోయే సమాధానమిచ్చిందట.
దాంతో ఆ విలేకరి మరేమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతే మళ్లీ నయనతార కల్పించుకుని అదంతా వయస్సు వల్ల వచ్చిన ఆకర్షణగానే తాను భావించానని, అందుకే ఎలాంటి ప్రేమ విషయంలోను తాను అప్పట్లో ఇరుక్కోలేదని వివరించిందట.
అంతేలేండి ప్రేమ గురించి అంతబాగా తెలుసు కాబట్టే ప్రేమికుడు దూరమైనా నయనతార అంత నిబ్బరంగా ఉండగలుగుతోంది. మనలో మనమాట ఆ మధ్య తన పాత ప్రేమికుడైన ఆ తమిళ హీరోతో ఓ కార్యక్రమంలో పక్క పక్కనే కూర్చుని ఉన్న ఫోటోల్ని మనం పేపర్లో చూశాం కదా. అయితే అది కూడా వయస్సు ప్రభావమనే అనుకుందామా.
