తెలుగులో ఎవరు సెక్సీ హీరోయిన్ అన్న విషయంపై కొంతమంది నిర్మాతల మధ్య ఆసక్తికరమైన చర్చ ఒకటి వచ్చిందట. చర్చ అంటే అది సాధారణంగా కాదు తెరపై అందాలను ఆరబోయడంలో ఏ హీరోయిన్ ముందుంది అన్న విధంగా సాగిందట ఆ చర్చ.
ఈ చర్చలో ఇద్దరి హీరోయిన్ల పేర్లు ముఖ్యంగా విన్పించిందట. వారెవరో కాదు. సన్నని నడుముతో, సెక్సీ చూపులతో కసెక్కించే ఇలియానా ఒకరైతే ముద్దుగా, బొద్దుగా తన అందాలను ఆరోబోసే ఛార్మి మరోకరు. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లకు మంచి మార్కెటే ఉన్నా సదరు నిర్మాతల బృందం మాత్రం సెక్సీ హీరోయిన్‌గా ఛార్మీనే ఎంపిక చేసిందట.
అందుకు కారణం ఏమంటే ప్రస్తుతం విడుదలైన చిత్రాల్లో ఇద్దరూ నటించినా అందాల ఆరబోతలో మాత్రం ఛార్మినే ముందుందట. అవును మరి తొలిచిత్రం దేవదాసు, ఆ తర్వాత వచ్చిన ఖతర్నాక్ చిత్రాల్లో తెగ ఎక్స్‌ఫోజింగ్ చేసిన ఇలియానా అటుపై కాస్త మడిగట్టుకున్నట్టే నటిస్తోంది.
అయితే ఛార్మీ మాత్రం తాను నటిస్తున్న ప్రతి చిత్రంలో ఏమాత్రం అవకాశమున్నా చిట్టి, పొట్టి బట్టల్తో ప్రేక్షకుల బీపీని అమాంతం పెంచేస్తోంది. అంతేకాదు తాజాగా ఇలియానా, ఛార్మీ ఇద్దరూ ఉన్న భలే దొంగలు చిత్రంలో కూడా ఇలియానా కంటే ఛార్మియే గ్లామర్‌గా నటించింది.
అందుకేనేమో మన నిర్మాతలు కూడా ఛార్మీకే ఓటేసేశారు కాబోలు. ఈ చర్చ సమయంలో ఓ నిర్మాత రాబోయే తన చిత్రంలో ఛార్మీని మరింత అందంగా చూపించనున్నానని కూడా అన్నారట. ఈ చర్చంతా బహిరంగంగా జరిగిందని అనుకునేరు. ఫిల్మ్‌నగర్‌లోని ఓ గదిలో నిర్మాతలు మాట్లాడుకున్న ఈ మాటలన్ని ఆ గది గోడలు విని ఇదిగో ఇలా అందరికి చెప్పేశాయి మరి.
|