1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

సినిమా హిట్టైనా ఇలియానాకు కష్టాలేనట...?

హిట్టైనా ఇలియానా కష్టాలే
WD PhotoWD
ఇలియానాకు సినిమాలు లేక కష్టపడుతోందని తెలుగు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయట. అదేంటి తాజాగా విడుదలైన జల్సా, భలేదొంగలు చిత్రాల్లో ఇలియానానే కదా హీరోయిన్. మరి ఆమెకు సినిమాలు లేకపోవడమేంటని ఆశ్చర్యపోకండి.

ఇలియానాకు సినిమాలు లేంది ప్రస్తుతం కాదు, భవిష్యత్‌లో అని కూడా వారే చెప్పేస్తున్నారు. అదేంటంటే ఈ రెండు సినిమాల తర్వాత ఇలియానా నటించనున్న తెలుగు సినిమాలేవీ ప్రస్తుతం లేకపోవడమే అందుకు కారణమట. ఎందుకంటే ఈ మధ్య తెలుగు ప్రేక్షకులకి ఇలియానా కన్నా కొత్త హీరోయిన్లే తెగ నచ్చేస్తున్నారంట.

అందుకే నిర్మాతలంతా కొత్తవారి కోసం వెదుకుతున్నారంట. అంతేనా పోకిరి హిట్‌ తర్వాత కోటి కంటే ఏమాత్రం తగ్గనని భీష్మించుకున్న ఇలియానావైపు చూడడానికి నిర్మాతలు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదట. దీంతో కాస్త ఫీలైపోయిన ఇలియానా పక్క రాష్ట్రాలవైపు చూస్తోందట.

అదేనండీ. ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి ప్రయత్నిస్తోందట. అవును మరి శ్రేయ కూడా తెలుగులో దుకాణం ఎత్తేశాకే కదా తమిళంలో బిజీ అయ్యింది. అలాగే ఇలియానా కూడా మరో భాషలో బిజీ అవుతుందేమో మరి.
About Writer
Munibabu