కొత్తవాళ్లకు నో చెబుతోన్న స్నేహ
|
కొద్ది రోజుల క్రితం తమిళనాడుకు చెందిన ఓ మంత్రిగారి కుమారుడు పరిచయం అవుతోన్న చిత్రంలో నటించడానికి స్నేహను సంప్రదిస్తే టైం లేదని చెప్పేసిందట. టైం లేక కాదు కొత్తవారితో నటించడానికి ఇష్టం లేకే అలా అంటోదని తమిళ నిర్మాతలు పాపం బాధపడుతున్నారట.
ఎందుకంటే పెద్ద హీరోల చిత్రాలైతే మాత్రం టక్కున కాల్షీట్లు ఇచ్చే స్నేహ హీరో కొత్తవాడైతేనే నో అని చెబుతోందని వారు వాపోతున్నారు. కానీ స్నేహ మాత్రం ప్రస్తుతం తన చేతిలో ఏడు సినిమాలన్నాయని అందుకే కొన్ని చిత్రాలు ఒప్పుకోలేక పోతున్నానని అంటోంది.
అంతే మరి స్నేహకు కూడా బాగా వయసైపోతోంది. అందుకే తన వయసుకు తగ్గట్టు పెద్ద హీరోల పక్కన నటించాలని అనుకుంటోంది కాబోలు. అవేమీ పట్టించుకోకుండా కుర్రాళ్ల పక్కన నటించడం లేదని ఆ నిర్మాతలు స్నేహ మీద అలగడం ఏమైనా బాగుందా.
