1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఇద్దర్ని ప్రేమించడం నా వల్ల కాదు: ఐష్

ఇద్దర్ని ప్రేమించడం కాదు ఐష్
WD PhotoWD
ఇద్దర్ని ప్రేమించడం నా వల్ల కాదని ఐశ్వర్య చెప్పడమేంటని ఆశ్చర్యపోకండి. అందులోనూ మన ఐశ్వర్యకి పెళ్లి కూడా ఐపోతేనూ అంటూ మరిన్ని ఆరాలు తీయకండేం. తాను ఇద్దర్ని ప్రేమించలేనని ఐశ్వర్య అన్నది నిజ జీవితంలో కాదులేండి. తెరమీదనే.

కరన్ జోహాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం మధ్య ప్రేమ సన్నివేశాల్లో నటించడం తనవల్ల కాదని ఐశ్వర్య తెగేసి చెప్పేసిందట. ఎందుకని ఐశ్వర్యనే ప్రశ్నిస్తే కరన్ జోహాన్ చెప్పిన ప్రకారం ఈ చిత్రంలో తాను అభిషేక్ అబ్రహాంలతో ముక్కోణపు ప్రేమ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది, అందుకే ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాల్లో నటించడం తనవల్ల కాదని చెప్పినట్టు ఐశ్వర్య వివరించింది.

తను ప్రస్తుతం అభిషేక్ భార్య కాబట్టి, భర్త ఎదుట మరొకరితో అలా నటించడం ఇబ్బందిగా ఉంటుందని అందుకే ఆ చిత్రాన్ని నిరాకరించానని చెప్పింది. అయితే మీరు ఇంతకు ముందు హృతిక్, అభిషేక్ కాంబినేషన్‌లో వచ్చిన ధూమ్-2లో హృతిక్‌తో బాగా క్లోజ్‌గా నటించారు కదా, అంటే... అది పెళ్లి కాకముందు సంగతి ఇప్పుడు పెళ్లైపోయింది కదా, అని చెప్పుకొచ్చింది.

అంటే పెళ్లికాక ముందు ఎలాగైనా ఉండవచ్చు. పెళ్లి తర్వాత మాత్రం పద్ధతిగా ఉండాలన్నమాట. వావ్ ఐశ్వర్యారాయ్ రూటే వేరులాగుంది. వింటున్నారా... పెళ్లి కావాల్సినవాళ్లంతా మన ఐశ్వర్యనే ఫాలో అయిపోతే బాగుంటుంది కదూ.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న రోబో చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోన్న ఐశ్వర్యారాయ్ ఆ చిత్రం కోసం భారీ పారితోషికాన్నే డిమాండ్ చేస్తోందట. అంతేనా ఈ చిత్రంలో ఐశ్వర్య మామగారు కూడా అదేనండీ అమితాబ్ గారు కూడా ఓ గెస్ట్ రోల్ చేయనున్నారట. ఇంకే దక్షిణాది తెరపై మరోమారు ఐశ్వర్య దర్శనభాగ్యం కలగబోతోందన్న మాట.