1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

బిగ్ బీ చెప్పిన '' చందమామ '' కథలు

బిగ్ బీ చందమామ కథలు
WD PhotoWD
చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడి చదివే చందమామ కథలంటే బాలీవుడ్ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌కు కూడా ఇష్టమేనట. అంతేనా ఆ పుస్తకాలను ఆయన ఎగబడి కొనేవారట. అయితే ఇప్పుడు కాదులేండి. ఆయన చిన్నప్పుడట.

ఎప్పుడూ చేప్పే రూమర్‌లా ఇది వేరెవరో చెప్పింది కాదండి. ఈ విషయాన్ని అమితాబే స్వయంగా చెప్పారు. చందమామ పిల్లల పత్రిక ప్రారంభించి అరవై ఎళ్లు ప్రారంభమైన సందర్భంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అమితాబ్ పాల్గొన్నప్పుడు ఈ విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

తనకు ఇంతగా ఇష్టమైన చందమామ కథల్ని ఇంటర్‌నెట్ ద్వారా కూడా పిల్లలకి దగ్గర చేయాలని నిర్వాహకులకు ఆయన ఓ సలహా కూడా ఇచ్చారు. చిన్న పిల్లలకు లోక జ్ఞానాన్ని అందించే చందమామ కథలు ఏమాత్రం చెడు చేయవని ఆయన కితాబిచ్చారు.

అంతేనా లేక ఇంటర్‌నెట్‌లో పెట్టే చందమామ కథలకి తానే ప్రచారం చేస్తానని కూడా అమితాబ్ అడగలేదు కదా. ఎందుకంటే ఆయన ఎంతో అందంగా పిల్లల ప్రోడక్ట్స్ యాడ్‌లు చేస్తారు కదా.
About Writer
Munibabu