1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ప్రకటనలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు: అసిన్

ప్రకటనల ప్రాముఖ్యం లేదు అసిన్
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో మంచి మార్కెట్ ఉన్న అసిన్ యాడ్స్‌లోనూ తన సత్తా చూపిస్తోంది. దీంతో అసిన్ సినిమాల కన్నా యాడ్‌లపైనే అధికంగా దృష్టి సారిస్తోందని ఇండస్ట్రీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఈ విషయమై అసిన్‌ను కదిలించగా అవన్నీ వట్టి గాలి కబుర్లేనని కొట్టి పారేసింది. అంతేనా తాను ప్రస్తుతం అమిర్‌ఖాన్ హీరోగా రూపొందుతోన్న తమిళ గజినీ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నానని తెలిపింది. అలాగే హిందీలో మరో సినిమాకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నయని అసిన్ పేర్కొంది.

వీటితో పాటు కమల్ దశావతారం చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం కోసం ఏప్రిల్ 25న చెన్నై చేరుకోనున్నట్టు ఆమె తెలిపింది. ఈ దశావతారం చిత్రం తన కెరీర్‌లోనే బెస్ట్ చిత్రం కానుందని, ఈ చిత్రం ద్వారా తానెంతో నేర్చుకున్నానని అసిన్ తెలిపింది.

యాడ్స్‌లో ఎక్కువగా నటిస్తున్న మాట వాస్తవమే అయినా సినిమాలు లేక తాను యాడ్‌లలో నటిస్తున్నానని అనుకోవడం సరికాదని అసిన్ తెలిపింది. సినిమాలు చేతినిండా ఉండడం వల్లనే తనకు యాడ్‌లు వస్సున్నాయని అసిన్ పేర్కొంది. సినిమాల్లో నటించడానికి పూర్తి సమయం కేటాయిస్తానని, సినిమాల నుంచి సమయం దొరికినపుడే యాడ్‌లలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.
About Writer
Munibabu