1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

దొంగసచ్చినోళ్లతో రంభ ఓకే

దొంగసచ్చినోళ్ల రంభ ఓకే
WD PhotoWD
రంభ ప్రధాన పాత్రలో కృష్ణభగవాన్, రఘబాబు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం దొంగసచ్చినోళ్లు. ఈ చిత్రం పేరు ఎంత మోటుగా ఉందో, ఈ చిత్ర నిర్మాతల ప్రవర్తన కూడా దాదాపు అలాగే ఉందంటూ ఆ మధ్య రంభ విచారించడం మొదలు పెట్టిందట.

దీంతో ఇక ఈ చిత్రం ఏమాత్రం ముందుకెళుతుందిలే అంటూ ఫిల్మ్‌నగర్ జనాలు గుసగుసలాడేసుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించేసరికి ఫిల్మ్‌నగర్ వారు తెగ ఆశ్చర్యపోతున్నారట.

అంత ఆశ్చర్యం ఎందుకంటారా, రంభ గొడవతో ఈ చిత్రం నిలిచిపోతుందని అనుకున్నవారికి చిత్రం పూర్తయి రిలీజ్ కూడా కానుందని తెలిస్తే అంతేగా మరి.

మరో విషయం ఈ చిత్ర దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ దొంగసచ్చినోళ్లు చిత్రం ప్రమోషన్ కోసం

ఎప్పుడు పిల్చినా తాను వస్తానని రంభ చెప్పిందని అంటున్నారు. సినిమాల్లో ఇప్పుడిప్పుడే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రంభ ఈ చిత్రంలో ఓ మోస్తరుగా అందాన్ని ప్రదర్శించిందట.

అయితే చిత్రం ప్రమోషన్‌కు సైతం ఆమెని పిలిపించడం ద్వారా చిత్రాన్ని మరింత బాగా ప్రేక్షకుల దగ్గరకు తీసుకుని పోవచ్చని దర్శకుడు భావించారట. ఏది ఏమైనా ఖర్చులు భరించి మరీ పిలిపిస్తుంటే రంభ కాదంటుందా, ఈ ఖర్చుతోటే రంభ తన ఇతర కార్యక్రమాలను కూడా చక్కబెట్టుకోనుందట.
About Writer
Munibabu