ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరు పార్టీ ఎంఎల్‌ఏగా కోగంటి రామకృష్ణ
chiru
WD PhotoWD
చిరంజీవి పార్టీ పెట్టడం మాట ఎటున్నా ఆయన మాత్రం ఇప్పటివరకు పార్టీ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ చాలామంది చిరు పార్టీలో తమకు ఎంఎల్ఏ టికెట్లు కేటాయించేసిన రేంజ్‌లో చెప్పేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా నిర్మాత కోగంటి రామకృష్ణ కూడా చేరారు. ఈ మధ్య ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ చిరంజీవి స్వయంగా తనను వెతుక్కుంటూ వచ్చారని, అందువల్ల చిరు పార్టీ తరపున తాను ఎంఎల్ఏగా పోటీచేస్తానని అన్నారట. అంతేనా చిరంజీవికి తనకన్నా మంచి అభ్యర్ధి లభించడం కష్టమని కూడా ఆయన సెలవిచ్చారట.

కోగంటిని వెతుక్కుంటూ చిరంజీవి వెళ్లడమేంటో, అందుకోసం చిరుపార్టీ తరపున కోగంటి పోటీచేయడమేంటో ఏమీ అర్థం కావడం లేదుకదా, అదంతేనండీ, మరో రెండు నెలల్లో భవిష్యత్ కార్యాచరణ గురించి చిరంజీవి ప్రకటన చేయనున్నారని ఆయన బావమరిది అల్లు అర్జున్ ప్రకటన చేయడంతో అందరూ తమ జాగ్రత్తలో తామున్నారు.

ఇప్పటినుంచి ప్రకటనలు ఇస్తుంటే రేపు పార్టీ పెట్టాక చిరంజీవి చూపు తమపై పడకపోతుందా అని భావించి వీరంతా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు కాబోలు.
మరిన్ని
దొంగసచ్చినోళ్లతో రంభ ఓకే
ప్రకటనలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు: అసిన్
తల్లి పాత్రలు పోషించడానికి ఇంకా టైం ఉంది: శ్రేయ
తెరపై అందాల ఆరబోతకు త్రిష సిద్ధం
ఎన్నికలకు సినీ గ్లామర్: వేణుమాధవ్ పోటీ... ?
బిగ్ బీ చెప్పిన ' చందమామ ' కథలు