1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఇంటర్‌నెట్‌లో షారుక్ హాట్ సీన్స్... ?

ఇంటర్‌నెట్‌లో షారుక్ హాట్ సీన్స్
WD PhotoWD
తాజాగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుస విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టీమ్‌ని కొనుగోలు చేసిన షారుక్‌ఖాన్ ఖుషీగా ఉన్నాడు. అయితే అతని ఆనందానికి కాస్త బ్రేక్ కొట్టే ఓ విషయం జరిగింది. అదేంటంటే... అప్పుడెప్పుడో షారుక్ నటించిన చిత్రం తాలూకు హాట్ సీన్స్ తాజాగా నెట్‌లో దర్శనమిస్తున్నాయన్న వార్త.

అసలు సంగతి ఏంటంటే 1993 ప్రాంతంలో విడుదలైహిందీ చిత్రం "మాయా మేమ్ సాబ్" నుంచి తొలగించిన కొన్ని శృంగార సన్నివేశాలు నెట్‌లదర్శనమిస్తున్నాయట. దీంతో నెటిజన్లు ఎగబడి మరీ ఈ దృశ్యాలను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట.

ఈ చిత్ర కథలో దీప షారుక్‌తో అక్రమ సంబంధ పెట్టుకుంటుంది. దీనివల్ల వీరి మధ్య జరిగే దృశ్యాలను దర్శకుడు కాస్త హాట్ హాట్‌గా తెరకెక్కించారట. అయితే అప్పట్లో ఈ సన్నివేశాలు సెన్సార్ బారిన పడ్డాయి. అయితే ఈ సన్నివేశాలు ఇంతకాలానికి ఎలా వెలుగులోకి వచ్చాయో అని సినీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయట.
అసలు ఈ సన్నివేశాలను బయట పడేసింది ఎవరై ఉంటారో అని వాళ్లంతా ఆలోచిస్తున్నారట.
About Writer
Munibabu