1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

నిరాహార దీక్షకు డుమ్మా: అసిన్‌పై తమిళ చిత్రసీమ గరంగరం

నిరాహార దీక్ష అసిన్‌ తమిళ చిత్రసీమ గరంగరం
WD PhotoWD
తమిళనాడు సినీ పరిశ్రమ ఇటీవల నిర్వహించిన ఓ నిరాహారదీక్షలో పాల్గొనని కారణంగా హీరోయిన్ అసిన్‌పై తమిళ సినీ నడిగర్ సంఘం చర్యకు ఉపక్రమించనున్నట్టు అక్కడి సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిరాహారదీక్షలో పాల్గొనని అసిన్ అటుపై కనీసం వివరణ కూడా ఇవ్వని కారణంగానే నడిగర్ సంఘం అసిన్‌పై కోపంగా ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య తలెత్తిన హొగినేకల్ అనే నీటి ప్రాజెక్ట్ వ్యవహారంలో కారణంగా కర్ణాటకలో తమిళ సినిమాలపై దాడి జరగడాన్ని తప్పుపడుతూ తమిళ సినీ పరిశ్రమ ఏప్రిల్ 4న ఒక్కరోజు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తమిళ సినీ రంగానికి చెందిన అన్ని రంగాలవారు హాజరు కావాల్సిందిగా తమిళ సినిమా నడిగర్ సంఘం ఆదేశించిందట.

అయితే ఈ కార్యక్రమానికి అసిన్‌తో సహా మరికొందరు సినీ ప్రముఖులు హాజరుకాలేదట. దీంతో నిరాహారదీక్ష కార్యక్రమానికి హాజరుకాని వారు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని నడిగర్ సంఘం కోరింది. అయితే అసిన్ మినహా మిగిలినవారు తాము ఎందుకు కార్యక్రమానికి హాజరుకాలేక పోయామో తెలుపుతూ వివరణ అందించారు.

కానీ అసిన్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదట. దీంతో అసిన్‌పై చర్య తీసుకోవడానికి నడిగర్ సంఘం సిద్ధమౌతోందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
About Writer
Munibabu