ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కొండచిలువకు ముద్దిచ్చిన నమిత
Namitha
WD PhotoWD
తెలుగుచిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన నమిత ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో తమిళ చిత్రసీమ వైపు వెళ్లిపోయింది. సినిమాల్లోకి ప్రవేశించే నాటికే కాస్త బొద్దుగా ఉండే నమిత తమిళంలోకి అడుగు పెట్టాక ఇంకాస్తా గుండ్రంగా తయారైంది.

ఏ అదృష్టం కలిసి వచ్చిందో తెలియదు గానీ నమిత ఇప్పుడు తమిళ తంబిల డ్రీమ్ గర్ల్‌గా మారింది. దాంతో నమిత ఏం చేసినా అక్కడి యువకులు ఆమెకు బ్రహ్మరధం పడుతున్నారట. దీంతో నమిత చేసే ప్రతి విషయానికి కోలీవుడ్‌లో విపరీతమైన ప్రచారం లభిస్తోందట.

ఈమధ్య ఓ తమిళ చిత్రం షూటింగ్ సందర్భంగా ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న నమితను కొండచిలువను మెడలో వేసుకుని డాన్స్ చేయాల్సిందిగా డైరెక్టర్ కోరారట. మొదట కొండచిలువను చూసి భయపడిన నమిత కాస్త అలవాటు పడగానే భయం లేకుండా దాన్ని మెడలో వేసుకుని డాన్స్ చేసిందట.

అంతేనా షూటింగ్ ముగిశాక కూడా నమిత ఆ కొండచిలువతో ఆడుకుంటూనే ఉందట. అంతేకాకుండా ఆ కొండచిలువపై కాస్త ప్రేమ పెరగడంతో నమిత ఆ కొండచిలువకు ముద్దులు కూడా పెట్టేసిందట.

అమ్మో అంతపెద్ద కొండచిలువకు నమిత ఎలా ముద్దు పెట్టిందా అని ఆ విషయం విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారట. ఈ విషయాలన్నీ ప్రస్తుతం కొలీవుడ్‌లో హుషారుగా షికారు చేస్తున్నాయి.

నమిత కొండచిలువతో ఉన్న ఫోటోలు సైతం అభిమానులకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నమిత ధైర్యానికి అభిమానులు సైతం మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారట. ఇప్పటికే తన బరువైన అందాలతో కుర్రకారుకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్న నమిత ముందుముందు ఇంకేం చేస్తుందో అని అక్కడి సినీ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయట.

మరిన్ని
నిరాహార దీక్షకు డుమ్మా: అసిన్‌పై తమిళ చిత్రసీమ గరంగరం
ఇంటర్‌నెట్‌లో షారుక్ హాట్ సీన్స్... ?
బాయ్ ఫ్రెండ్స్ అయితే గోలచేస్తారు
చిరు పార్టీ ఎంఎల్‌ఏగా కోగంటి రామకృష్ణ
దొంగసచ్చినోళ్లతో రంభ ఓకే
ప్రకటనలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు: అసిన్