1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

శివాజీతో దశ తిరిగిన శ్రియ: పారితోషికంగా కోటి డిమాండ్

శివాజీ దశ శ్రియ పారితోషికం కోటి డిమాండ్
WD PhotoWD
అదృష్టం అంటే శ్రియదే మరి. రజనీకాంత్‌తో శివాజీలో హీరోయిన్‌గా నటించినప్పటనుంచి అమె దశ తిరిగిపోయింది. దక్షిణాది చిత్రాలకే పరిమితమైన శ్రియ ప్రస్తుతం బాలీవుడ్‌లోను అవకాశాలు వెల్లువెత్తుతన్నాయట.

త్వరలో హాలీవుడ్‌లోను శ్రియ నటించబోతోందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శ్రియ తన చిత్రాలకు కోటివరకు పారితోషికం డిమాండ్ చేస్తోందట. శివాజీ చిత్రానికి ముందు 40 నుంచి 50 లక్షల వరకు డిమాండ్ చేసే ఈ అమ్మడు ప్రస్తుతం కోటికి ఏమాత్రం తగ్గనంటోందట.

అంతేనా బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నా కొన్ని చిత్రాలకు మాత్రమే ఎస్ అంటోందట. ప్రస్తుతం తమిళంలో శరత్‌కుమార్ హీరోగా నిర్మిస్తోన్న ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న శ్రియ ముందుముందు మరెంత పారితోషికం డిమాండ్ చేస్తుందో వేచిచూడాలి మరి.

మరో విషయం ఏంటంటే ప్రస్తుతం శరత్‌కుమార్‌తో నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రియ తల్లి పాత్ర పోషించబోతోందని కోలివుడ్‌లో ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. అదే విషయాన్ని శ్రియ దగ్గర ప్రస్తావిస్తే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది.

అంతేనా తాను తల్లి పాత్రలు పోషించాలంటే మరో పదేళ్ల తర్వాతే అని కూడా శ్రియ సెలవిచ్చేసింది. అంటే శ్రియ మరో పదేళ్లు హీరోయిన్‌గా నటించేస్తుందన్న మాట. ఎంత నమ్మకమో కదూ.
About Writer
Munibabu