ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తమిళ సినిమాతో చెత్త అనుభవం: ఇలియానా
Iliyana
WD PhotoWD
వరుసగా విడుదలైన జల్సా, భలేదొంగలు చిత్రాలు విజయం సాధించడంతో మంచి ఖుషీగా ఉన్న ఇలియానా తనకు తెలుగు చిత్ర పరిశ్రమే నచ్చిందని, తమిళ చిత్రపరిశ్రమ అస్సలు నచ్చలేదని చెప్పుకొచ్చింది.

తమిళ పరిశ్రమ అంతలా నచ్చకపోవడానికి కారణమేంటని అడిగితే తమిళంలో తాను ఇప్పటివరకు ఒక్క చిత్రమే నటించానని, అ ఒక్క సినిమాతోనే తనకు తమిళ పరిశ్రమలో చెత్త అనుభవం ఎదురైందని బాధపడింది.

అదే తెలుగు పరిశ్రమలో ప్రతివారు తనను ఎంతో గౌరవిస్తారని, ఒక్కో చిత్రం చేస్తుంటే చాలా విషయాలు నేర్చుకున్నాని తెలిపింది. అంతేనా తెలుగులో పోకిరి హిట్ తర్వాత తమిళ పోకిరిలో కూడా తననే చేయమన్నారని, అయితే డేట్స్ కుదరక ఒప్పుకోలేదని చెప్పింది.

ప్రస్తుతం తాను ఎక్కువ రెమ్యునిరేషన్ డిమాండ్ చేస్తున్నానని చెప్పడం కూడా పుకారేనని కొట్టిపారేసింది. అలాగే ప్రస్తుతం తానేమీ హిందీ చిత్రాలు ఒప్పుకోలేదని, మంచి ఆఫర్లు వస్తేనే తమిళం, హిందీలో నటించే విషయం గురించి ఆలోచిస్తానని తెలిపింది.

అలాగే చిత్రాల ఎంపికలో తాను జాగ్రత్తగా ఉంటానని, అయితే సినిమా విజయం అనేది మన చేతిలో లేదని కూడా చెప్పుకొచ్చింది. ఇన్ని విషయాలు అడక్కుండానే చెప్పిన ఇలియానాతో తమిళ సినిమాతో చెత్త అనుభవం ఎదురైందని అన్నారు... కదా, ఏంటది అని ప్రశ్నిస్తే చెప్పాను కదా, చెత్త అనుభవమని అంటూ... ముగించింది.

అవును మరి ఇలియానా చెప్పింది కాబట్టి అది తప్పకుండా చాలా చెత్త అనుభవమే అయ్యి ఉంటుంది.
మరిన్ని
శివాజీతో దశ తిరిగిన శ్రియ: పారితోషికంగా కోటి డిమాండ్
కొండచిలువకు ముద్దిచ్చిన నమిత
నిరాహార దీక్షకు డుమ్మా: అసిన్‌పై తమిళ చిత్రసీమ గరంగరం
ఇంటర్‌నెట్‌లో షారుక్ హాట్ సీన్స్... ?
బాయ్ ఫ్రెండ్స్ అయితే గోలచేస్తారు
చిరు పార్టీ ఎంఎల్‌ఏగా కోగంటి రామకృష్ణ