1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

తెలుగు తెరపై హీరోగా క్రికెటర్ శ్రీశాంత్

తెలుగు తెర హీరో క్రికెటర్ శ్రీశాంత్
WD PhotoWD
ఫేస్ బౌలర్ శ్రీశాంత్ తెలుగు తెరపై స్టెప్పులేసే దృశ్యాన్ని మనం తొందర్లోనే చూడబోతున్నాం. ఎందుకంటే త్వరలో శ్రీశాంత్ ఓ తెలుగు చిత్రంలో నటించనున్నాడట. అంతేనా ఈ చిత్రంలో ఆయన సరసన నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారట.

ఓ క్రికెటర్ సినీ హీరోగా ఎలా మారాడు అన్న కథాశంతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుందట. ఈ చిత్రం నిర్మాణం కోసం శ్రీశాంత్‌తో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ చర్చలు పూర్తయితే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందట. అయితే మిగిలిన విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొన్ని రోజులు ఆగాలి మరి.

బౌలర్‌గా క్రీజులో దిగిన ప్రతిసారి అరుపులతో తన బ్రేక్ డాన్సులతో ప్రేక్షకుల్ని అలరించే శ్రీశాంత్‌లో ఓ సినిమా స్టార్ కనిపించి ఉంటాడు. అందుకేనేమో మన సినిమా వాళ్ల దృష్టి శ్రీశాంత్ మీద పడింది.
About Writer
Munibabu