త్రిష నుంచి పోటీ: బాధపడుతోన్న నయనతార
|
అంతేనా నయనతారను తమ ప్రచార దూతగా తొలగిస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించేశారు కూడా. దీంతో పాపం నయనతార తనవెంట ఉంటూనే తనకు గుంతలు తవ్వుతున్నారంటూ తెగ బాధపడుతోందట.
అసలు విషయం ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రచారదూతగా ఉన్న నయనతార ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌కు హాజరుకాకపోవడంతో నిర్వాహకులకు చిరెత్తుకొచ్చి ఆమెను ప్రచారదూతగా తొలగించేశారట.
అంతేనా నయనతార స్థానంలో త్రిషను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా వారు సూచనప్రాయంగా ప్రకటించేశారట. దీంతో తెగ ఫీలైపోయిన మన నయనతార ఓ పత్రికా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనతో ఉండి తననే ముంచాలనుకునే వారే ఇలా చేస్తున్నారని వాపోయిందట.
ఇంతకీ నయనతార బాధపడుతోంది తనను తొలగించినందుకా... లేక త్రిషను నియమించినందుకా... ఎమో ఈ విషయం మాత్రం నయనతారకే తెలియాలి. ఎందుకంటే ఆడవారి మాటలకు అర్ధాలే వేరు కదా.
