చీరలంటే తనకు చిరాకని నమిత చెబుతోంది. భైరవిగా తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ సొట్టబుగ్గల భామ తొలినాళ్లలో నటించిన జెమిని, సొంత లాంటి చిత్రాలు ఫట్ మనడంతో ఐరన్‌లెగ్‌గా పేరుతెచ్చుకుంది. దీంతో తెలుగులో అవకాశాలు సన్నగిల్లి, తాను మాత్రం కాస్త లావుగా తయారైంది.
దీంతో అవకాశాలకోసం నమితగా పేరు మార్చుకున్న ఈ అమ్మడు అప్పటికీ అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రసీమకు వలసవెళ్లిపోయింది. పొరిగింటి పుల్లకూర రుచిలాగా వారికి నమిత మహబాగా నచ్చేసింది. దీనికితోడు నమిత సైతం ఒళ్లు దాచుకోకుండా అందాల ఆరబోతకు సిద్ధమయ్యేసరికి అవకాశాలు సైతం వెల్లువెత్తాయి.
ప్రస్తుతం తమిళంలో నమిత బాగా బిజీగా ఉందట. అంతేనా ఈ మధ్య టూ పీస్ డ్రస్సులతో సైతం నటించడం మొదలు పెట్టేసరికి అభిమానులు సైతం విస్తుపోతున్నారట. ఇలాంటి సమయంలో ఆ మధ్య ఓ విలేకరి ఏమీ తోచక మీరు చీరల్లో అస్సలు కనిపించడం లేదేంటి అని అడిగితే తనకు చీరలంటేనే చిరాకని నమిత కాస్త చిరాగ్గా సమాధానమిచ్చిందట.
అలాగా, ఎందుకేంటి అని ప్రశ్నిస్తే నాకు జీన్స్ లాంటి డ్రస్సులు మాత్రమే సౌకర్యంగా ఉంటుందని అందుకే తాను అలాంటి డ్రస్సులకే పరిమితమైనట్టు చెప్పిందట. అంతేకాకుండా తన ఒంటిపై చీర అస్సలు నిలబడదని అందుకే తాను ఇంట్లో ఉన్నప్పుడు సైతం మాడ్రన్ డ్రస్సుల్లోనే ఉంటానని మరీ వివరించిందట. అయితే ఏదైనా పండుగలు, విశేషాలు లాంటి సమయాల్లో మాత్రం చీర కట్టుకుంటానని చెప్పిందట.
అయితే ప్రారంభోత్సవాలకు సైతం అదిరిపోయే డ్రస్సులతో వెళ్లే నమితకు అలాంటి డ్రస్సుల్లో నిర్మాతలు చూడడం ద్వారానే సినిమా ఆఫర్లు వస్తున్నాయని కూడా కొందరు చెప్పుకుంటున్నారట. ఏదైతేనేం... మాడ్రన్ డ్రస్సుల వల్ల అటు సౌకర్యంగానూ, ఇటు అవకాశాలు వస్తూ నమిత ఖుషిగా ఉంటుంటే అంతకన్నా మనకు... సారీ అభిమానులకు కావల్సిందేముంది చెప్పండి.
|