ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంకెప్పుడు చచ్చిపోను: మాటిచ్చిన త్రిష
Trisha
WD PhotoWD
తాను ఇంకెప్పుడు చచ్చిపోనని త్రిష తన తల్లికి, స్నేహితులకు మాటిచ్చిందట. ఎందుకు అలా మాటివ్వాల్సి వచ్చిందన్న సంగతి కూడా త్రిషనే చెప్పుకొచ్చింది.

ఈ మధ్య త్రిష హీరోయిన్‌గా విక్రమ్‌తో కలిసిన నటించిన భీమ అనే తమిళ చిత్రంలో చనిపోయే సన్నివేశం ఒకటి ఉందట. ఈ సినిమాలో కథ ప్రకారం త్రిషను రౌడీలు తుపాకీతో కాల్చి చంపేస్తారట. ఆ సినిమా విడుదలయ్యాక దాన్ని చూసిన త్రిష తల్లి, స్నేహితులు ఆ చిత్రంలో త్రిష చనిపోవడాన్ని చూసి అస్సలు తట్టుకోలేకపోయారట.

అంతేనా త్రిష చనిపోయినట్టు సినిమాలో చూసిన వారు బోరున ఏడ్చేచి త్రిషను బాగా తిట్టేశారట, ఎందుకంటే త్రిష చనిపోయినట్టు నటించడాన్ని సైతం వారు తట్టుకోలేకపోయారట, ఈ విషయాలన్ని త్రిష చెబుతూ తాను చనిపోయినట్టు నటించిన సన్నివేశాన్ని చూసి తన అమ్మైనా కాస్త తట్టుకుందని, కానీ తన స్నేహితులు మాత్రం అస్సలు తట్టుకోలేక పోయారని రాగాలు తీసి మరీ చెప్పింది.

అందుకే ఇకపై ఎప్పుడు కూడా చనిపోయే సన్నివేశాల్లో నటించకూడదని తాను నిర్ణయించుకున్నానని త్రిష తెలిపింది. అంతాబాగానే ఉందిగానీ చనిపోయే సన్నివేశాల్లో నటించొద్దని చెప్పిన ఆమె సన్నిహితులు ఎక్స్‌పోజింగ్ సన్నివేశాల్లో కూడా నటించొద్దని చెప్పలేదు కాబట్టి సరిపోయింది.

లేకుంటే ఇప్పుడిప్పుడే టూ పీస్ డ్రస్సులలో సైతం నటించడానికి సిద్ధమౌతోన్న త్రిష అందాల్ని చూసే ఛాన్స్‌ని ఆమె అభిమానులు పాపం మిస్ అయ్యిండేవారే.
మరిన్ని
చీర కట్టుకోవడమంటే నాకు చిరాకు: నమిత
'రోబో' నుంచి తప్పుకున్న అందాల బొమ్మ..?
త్రిష నుంచి పోటీ: బాధపడుతోన్న నయనతార
తెలుగు తెరపై హీరోగా క్రికెటర్ శ్రీశాంత్
తమిళ సినిమాతో చెత్త అనుభవం: ఇలియానా
శివాజీతో దశ తిరిగిన శ్రియ: పారితోషికంగా కోటి డిమాండ్