1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

మీరాజాస్మిన్‌పై '' అమ్మ '' కు కోపం: చర్యకు నిర్ణయం

మీరాజాస్మిన్‌ అమ్మ కోపం చర్యకు నిర్ణయం
WD PhotoWD
హీరోయిన్ మీరాజాస్మిన్‌పై ' అమ్మ ' కు కోపమొచ్చిందట. అమ్మ అంటే మీరాజాస్మిన్ వాళ్ల అమ్మ కాదులేండి. కేరళలోని మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల సంఘాన్ని అమ్మ అంటారు లేండి. అదిగో ఆ అమ్మకు మీరాజాస్మిన్‌కు కోపం వచ్చిందన్నది ప్రస్తుతం తాజా వార్త.

విషయం ఏంటంటే పైన చెప్పుకున్న అమ్మ సంఘం అభివృద్ధి కోసం మళయాళ సినిమా ఇండస్ట్రీ నిర్మించ తలపెట్టిన ట్వంటీ-ట్వంటీ అనే చిత్రంలో నటించడానికి మీరాజాస్మిన్ నిరాకరించిందట. దాంతో మీరాజాస్మిన్‌పై చర్య తీసుకోడానికి ' అమ్మ ' సిద్ధమైందట.

ఈ చిత్రంలో మలయాళంలో ప్రసిద్ధ నటులైన మోహన్‌లాల్, మమ్ముటి లాంటి నటులంతా పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారట. నయనతార సైతం ఈ చిత్రంలో ఓ పాటకు నర్తించనుందట.

మరి అలాంటి చిత్రంలో మీరాజాస్మిన్ నటించనంటే వాళ్లకి కోపం రాదా మరి. అంతేనా ఈ చిత్రంలో నటిస్తే రెమ్యునిరేషన్ ఇవ్వరు కాబట్టే మీరా నటించనంటోందని కొందరు అనుకోవడం ప్రారంభించారట.

కానీ మీరాజాస్మిన్ మాత్రం తను ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్న కారణంగా కాల్షీట్లు లేవని అందుకే తాను నటించలేనన్నానని వివరించింది. అయితే మీరాజాస్మిన్ కావాలనే కాదంటోందని అమ్మ సంఘం మాత్రం చర్య తీసుకోడానికే సిద్ధమౌతోందట.

అదేసమయంలో ఈ చిత్రంలో మీరాజాస్మిన్ స్థానంలో త్రిషా లేదా అసిన్‌ను నటింపజేయడానికి అమ్మ ప్రయత్నిస్తోందట. ఎంటో ఈ మధ్య మీరాజాస్మిన్‌కు అన్నీ కష్టాలే.