హాలీవుడ్ చిత్రం కోసం బెల్లీడాన్స్: శ్రియ
|
అంతేనా ప్రస్తుతం తాను నటిస్తున్న హాలీవుడ్ చిత్రం అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్‌లో బెల్లీడాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటానని కూడా అంటోంది. అసలు విషయం ఏంటంటే ఈ హాలీవుడ్ చిత్రంలో శ్రియ ఓ బెల్లీడాన్స్ కళాకారిణి పాత్ర పోషిస్తోందట.
ఈ చిత్రంలో బెల్లీడాన్స్‌ను చక్కగా చేయడం కోసం శ్రియ కష్టపడి ఆ డాన్స్ నేర్చుకుందట. ఆ బెల్లీడాన్స్ నేర్చుకున్న వివరాల గురించి శ్రియ మాట్లాడుతూ బెల్లీడాన్స్ చూడడానికి చాలా సులభంగా కనిపిస్తుంది గానీ, చేయడం మాత్రం చాలా కష్టం అని చెబుతోంది.
అదేసమయంలో శివాజీ తర్వాత తమిళంలో మీ మార్కెట్ ఎలా ఉందని ప్రశ్నిస్తే తమిళంలో తనకు మంచి డిమాండ్ ఉందని, బాలీవుడ్‌లో సైతం ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకోచ్చింది. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ప్రస్తుతం విక్రమ్‌తో నటిస్తోన్న కందస్వామి (తెలుగులో మల్లన్న) చిత్రం తప్ప శ్రియ చేతిలో మరే ప్రాజెక్ట్ లేదని చెప్పుకుంటున్నారు.
అందకు కారణం తమిళంలో కామెడీ ఆర్టిస్ట్ వడివేలు హీరోగా చేసిన చిత్రంలో శ్రియ స్పెషల్ సాంగ్ చేయడమేనట. దీంతో తమిళ హీరోలెవరూ శ్రియను తమ సినిమాల్లో పెట్టుకోడానికి పెద్దగా ఉత్సాహం చూపడం లేదట.
అయితే శ్రియ మాత్ర ఇలాంటి వార్తలను ఖండిస్తోంది. తన ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నానని, టైం లేక తానే కొన్ని చిత్రాలకు ఒప్పుకోవడం లేదని చెప్పింది. ఏదైతేనేం తెలుగులో శ్రియకు ఆఫర్లు లేకపోయినా ఇతర బాషల్లో బాగానే డిమాండ్ ఉందనమాట.
