ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజకీయమంటే అర్ధం కూడా తెలియదు: మహేష్‌బాబు
Maheshbabu
WD PhotoWD
తెలుగుతెరపై బాలనటుడిగా అడుగుపెట్టిన మహేష్‌బాబు ఓ వయసు తర్వాత ప్రిన్స్‌గా తెరంగేట్రం చేసి యువ కథానాయకుల్లో అగ్రస్థానంలో నిలిచారు. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న మహేష్ కార్పోరేట్ సంస్థల హీరోగా తెలుగులో ఎవరూ సాధించని క్రేజ్‌ను సంపాదించారు. దీంతో క్రేజ్ ఉన్న హీరోగా మహేష్‌ను రాజకీయాల్లోకి సైతం లాగడానికి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. .

ఎందుకంటే ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లోకి నటీనటుల ప్రవేశం పెరిగిపోయిన తరుణంలో సినిమాలతో పాటు రాజకీయాల్లోకి నటులు ప్రవేశించడం ఆనవాయితీగా మారింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడు తనకున్న సినిమా ఇమేజ్‌తోనే ముఖ్యమంత్రి పదవి సాధించారన్న విషయం తెలియంది కాదు.

ఆనాటి నుంచి ఆ పార్టీలో నటుల ప్రస్తావన ఉంటూనే ఉంది. తాజాగా ఆ పార్టీ ప్రతిపక్షస్థానంలో ఉంటోంది. అందుకే రానున్న ఎన్నికల్లో విజయం కోసం ఎన్టీఆర్ వారసుల్ని రంగంలో దింపడానకి సిద్ధమైంది. ఎందుకంటే వారికి నటులుగా, ఎన్టీఆర్ వారసులుగా ప్రజల్లో క్రేజ్ ఉంది కాబట్టి.

దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమా హీరోలను రంగంలో దింపి ప్రజలను ఆకర్షించడానకి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం వరకు కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలున్న హీరో కృష్ణ కుమారుడు మహేష్‌బాబును రంగంలోకి దింపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది.

ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృష్ణతో సంప్రదింపులు కూడా జరిపిందన్న గుసగుసలు వినిపించాయి. అలాగే కొన్ని రోజుల క్రితం మహేష్‌బాబు సోదరుడు, ఆయన చిన్నాన ఇండ్లపై ఆదాయపన్న శాఖ దాడులు జరిగాయి. ఈ దాడులకు కారణం మహేష్‌బాబుపై ఒత్తిడి తేవడం ద్వారా ఆయన్ను రాజకీయాల్లోకి లాగడానికే అన్నట్టు కూడా చెప్పుకున్నారు.

అయితే ఈ విషయాలన్నింటికి సమాధానం చెబుతున్న రీతిలో మహేష్‌బాబు మాట్లాడారు. రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ శీతలపానియం కంపెనీ ప్రచార కార్యక్రమంలో మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ రాజకీయ ప్రవేశం గురించి ఆయన దగ్గర విలేకరులు నేరుగా ప్రశ్నించారు.

దీనికి మహేష్ సమాధానమిస్తూ తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని, వాటికి కనీసం అర్ధం కూడా తెలియదని అన్నారు. అంతేనా ఎమ్ఎల్ఏ, ఎంపీ అంటే ఏంటో కూడా తనకు తెలియదని ఆయన సెలవిచ్చారు. రాజకీయాల్లోకి తాను రాననే విషయాన్ని మహేష్ ఎంత తెలివిగా చెప్పారో కదా.
మరిన్ని
హాలీవుడ్ చిత్రం కోసం బెల్లీడాన్స్: శ్రియ
మీరాజాస్మిన్‌పై ' అమ్మ ' కు కోపం: చర్యకు నిర్ణయం
ఇంకెప్పుడు చచ్చిపోను: మాటిచ్చిన త్రిష
చీర కట్టుకోవడమంటే నాకు చిరాకు: నమిత
'రోబో' నుంచి తప్పుకున్న అందాల బొమ్మ..?
త్రిష నుంచి పోటీ: బాధపడుతోన్న నయనతార