1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

కాజల్ బాగా బెట్టు చేస్తోంది: నిర్మాతల ఆరోపణ

కాజల్ బెట్టు నిర్మాతల ఆరోపణ
WD PhotoWD
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చిన్నది కాజల్ అగర్వాల్. ఈ చిత్రంతో కాజల్ అందరి దృష్టిలో పడింది. దీంతో కాజల్ అగర్వాల్‌కు అవకాశాలు వెతుక్కుని వస్తున్నాయి. తాజాగా నితిన్‌తో కలిసి నటించిన ఆటాడిస్తా, కొత్త హీరో సుశాంత్‌తో కలిసి నటించిన కాళిదాసు చిత్రాలు సక్సెస్ సాధించడంతో కాజల్ మరింత బిజీగా మారింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ రెండో చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే అన్నీ బాగానే ఉంది కానీ... కాజల్‌ ఈ మధ్య చాలా బెట్టు చేస్తోందని నిర్మాతలు వాపోతున్నారు. అలా వాపోతున్న నిర్మాతలు తెలుగువారు కాదులేండి తమిళ నిర్మతలు.

ఇంతకీ వారి బాధేంటంటే కొంచెం పేరు రాగానే ఈ అమ్మడు నిర్మాతలను తెగ ఇబ్బంది పెడుతోందట. దీంతో కాజల్ అంటే నిర్మాతలకు కాస్త భయం వేస్తోందట. అసలు కాజల్ హీరోయిన్‌గా తమిళంలో విడుదలైంది ఒక్కచిత్రమే. అయితే ఈ చిత్రం అక్కడ మంచి హిట్ సాధించింది.

దాంతో కాజల్ తన దగ్గరికి వచ్చే నిర్మాతలను గొంతెమ్మ కోరికలు కోరుతోందట. తనకు పారితోషికం ఎక్కువకావాలని, తను పెట్టే షరత్తులకు ఒప్పుకోవాలని కాజల్ చెబుతోందట. దీంతో కాజల్‌ను తమ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకోవాలనుకునే నిర్మాతలు ఎందుకొచ్చిన గొడవరా అని కాజల్ వైపుకే వెళ్లడం లేదట.

దీంతో ప్రస్తుతం తమిళంలో కాజల్ నటించే చిత్రం ఒక్కటి కూడా లేదని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే కాజల్ నటించింది మూడు చిత్రాలే అయినా నిర్మాతలను మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందన్నమాట. అమ్మో అయితే కాజల్ బాగా గడుసుదానిలా ఉందే.
About Writer
Munibabu