ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆమె వచ్చి చేసేదేముంది.. కెమేరాలకు ఫోజులివ్వటమేగా...
హీరోహీరోయిన్లు చిత్ర ప్రారంభోత్సవాలకు రావడం పరిపాటే. వారివారి చిత్రాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు కనుక హాజరుకావడం వారి విధి కూడానూ. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. చెన్నై నుంచి ఎవరైనైనా పిలవాల్సివస్తే... వారు రాకపోయినా ఫర్వాలేదనుకుంటున్నారు సదరు నిర్మాతలు.

ప్రస్తుతం మీరాజాస్మిన్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్న రాజ్ కంబైన్స్ నిర్మాతల పరిస్థితి ఇలాగే ఉంది. బుధవారం ప్రారంభమైన చిత్రంలో మీరాదే లీడ్ రోల్. కథంతా ఆమెపైనే నడుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రం కనుక పిలవగానే వస్తున్నానని రాష్ట్రమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

ఆమె రాగానే, హీరోయిన్ ఏదీ అనడిగితే... ఆమె బిజీగా ఉండి రాలేకపోయారని సర్ది చెప్పారు. ఇదే విషయమై మీడియా గుచ్చిగుచ్చి అడిగేసరికి... మీకు తెలియందేముంది బ్రదర్.. ఆమె డిమాండ్లు తట్టుకోలేక డైరెక్ట్‌గా సెకెండ్ షెడ్యూల్‌కి రమ్మని చెప్పామన్నారు. కనుక ఆమె వస్తే.. ఆమెతోపాటు మరికొంతమందికి ఫైట్ టిక్కెట్లు... స్టార్ హోటల్ ఫెసిలిటీలు.... కల్పించాలి కదా. తీరా ఆమె వచ్చి చేసేదేముంది... కెమేరాలకు ఫోజులివ్వడం మినహా అంటూ వ్యాఖ్యానించటం కొసమెరుపు.
మరిన్ని
కాజల్ బాగా బెట్టు చేస్తోంది: నిర్మాతల ఆరోపణ
రాజకీయమంటే అర్ధం కూడా తెలియదు: మహేష్‌బాబు
హాలీవుడ్ చిత్రం కోసం బెల్లీడాన్స్: శ్రియ
మీరాజాస్మిన్‌పై ' అమ్మ ' కు కోపం: చర్యకు నిర్ణయం
ఇంకెప్పుడు చచ్చిపోను: మాటిచ్చిన త్రిష
చీర కట్టుకోవడమంటే నాకు చిరాకు: నమిత