ఆ వెబ్‌సైట్లకు 'A' నీతి నియమాల్లేవ్
ఈమధ్య కొన్ని వెబ్‌సైట్లు తమ ఇష్టమొచ్చినట్లు నటీనటులు, దర్శకులపై చిలువలుపలువలుగా వార్తలు రాసేస్తున్నాయి. అవన్నీ చదివితే ఇంత నీచంగా దిగజారుతున్నాయా విలువలు అనిపిస్తోందని దర్శకుడు ఇవివి సత్యనారాయణ మండిపడ్డారు.
గతంలో ఇవివి తన ఇద్దరు కొడుకులతో కలిసి ఓ చిత్రాన్ని తీసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.... "ఆ చిత్రంలో కొత్తమ్మాయి హీరోయిన్. మా ఊరైన కోరుమామిడిలో బస ఏర్పాటు చేశాం. దానికే కొన్ని వెబ్‌సైట్లు ఒక అమ్మాయికోసం తండ్రీకొడుకుల యుద్ధం అంటూ రాసేశాయి. ఇంతకన్నా నీచమైన వార్త ఉండదు. బహుశా అలా రాసిన వ్యక్తికి ఆ ఆలోచన ఉందేమోనని ఎద్దేవా చేశారు.
అదే వెబ్‌సైట్ తాజాగా... నటుడు చలపతిరావు సహనటి హేమ, ఢిల్లీ రాజేశ్వరిలతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడని రాశాయి. అసలు ఈ వయస్సులో చలపతిరావు చేసేదేముంది. నోటి వాగుడు తప్ప..." అంటూ సదరు వెబ్‌సైట్లను విమర్శించారు.