ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దశావతారం పంక్షన్‌లో అసభ్యకర డ్రస్: మల్లికపై కేసు
Mallika
FileFILE
కమల్‌హాసన్ పదిపాత్రల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న దశావతారం చిత్రం ప్రారంభం నుంచే అనేక సంచలనాలకు తెరతీస్తోంది. ఈ చిత్రానికి కమల్ స్వయంగా కథ, మాటలు అందిస్తుండగా ఆస్కార్ ఫిలిం పతాకంపై అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రం గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇలాంటి భారీ అంచానాలతో రూపొందుతోన్న చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం కూడా అత్యంత భారీగానే జరిగింది. గత నెల 25న చెన్నైలో జరిగిన ఈ దశావతారం ఆడియో విడుదల కార్యక్రమానికి హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీఛాన్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్‌లతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి దశావతారం చిత్రంలో నటించిన మల్లికా షెరావత్ కూడా హాజరయ్యారు. అయితే మల్లిక ఈ కార్యక్రమానికి అత్యంత సెక్సీ డ్రస్‌తో రావడంతో అందరి చూపును ఆకర్షించారు. అయితే మల్లిక ఇలా ఒళ్ళంతా కనిపించేలా డ్రస్ చేసుకోవడం చూచి ఎంతమంది ఆనందించారో తెలియదు కానీ హిందూ మక్కల్ పార్టీకి మాత్రం తెగ చికాకు పుట్టించింది.

మల్లిక ఇలా అసభ్యకరంగా డ్రస్ వేసుకొచ్చి భారతీయ సంస్కృతిని మంటగలిపారని ఆ పార్టీ మండిపడింది. అంతేనా ఇలా మన సంస్కృతిని మంటగలిపిన మల్లికా షెరావత్‌పై చర్య తీసుకోవాలని కోరూతూ ఆ పార్టీకి చెందిన నేత ఒకరు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

గతంలో శివాజీ విజయోత్సవానికి శ్రియ ఇలాగే అసభ్యకరంగా డ్రస్ వేసుకొచ్చిందని సదరు పార్టీ గొడవ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయమై శ్రియ వారికి క్షమాపణలు సైతం చెప్పింది. ఆ విషయం సద్దుమణగక ముందే మల్లిక పేరు ఇలా తెరమీదకొచ్చింది.
మరిన్ని
ఆ వెబ్‌సైట్లకు 'A' నీతి నియమాల్లేవ్
ఆమె వచ్చి చేసేదేముంది.. కెమేరాలకు ఫోజులివ్వటమేగా...
కాజల్ బాగా బెట్టు చేస్తోంది: నిర్మాతల ఆరోపణ
రాజకీయమంటే అర్ధం కూడా తెలియదు: మహేష్‌బాబు
హాలీవుడ్ చిత్రం కోసం బెల్లీడాన్స్: శ్రియ
మీరాజాస్మిన్‌పై ' అమ్మ ' కు కోపం: చర్యకు నిర్ణయం