ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నా పేరు మారింది కాస్త గుర్తుంచుకోండి: తమన్నా
Tamanna
FileFILE
శ్రీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన తమన్నా హ్యాపీడేస్‌తో కాసింత పేరు తెచ్చుకుంది. అయితే ఈ రెండు చిత్రాల్లో సాంప్రదాయబద్ధంగా కనిపించిన తమన్నా అటుపై నాగార్జున మేనళ్లుడు సుశాంత్ హీరోగా పరిచయమైన కాళిదాసు చిత్రంలో కాస్త గ్లామర్ ఒలకబోసి తాను అన్ని రకాల పాత్రలు చేయగలనని నిరూపించుకుంది.

అలాగే తమిళంలోను దాదాపు ఓ ఆరు, ఏడు చిత్రాల్లో నటించిన తమన్నా అక్కడా సైతం మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇన్ని చిత్రాలు చేస్తున్నా తమన్నాను వెతుక్కుని వచ్చే చిత్రాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉందట. దీంతో ఏం చేయాలో తోచక న్యూమరాలజీ నిపుణులను సంప్రదించిందట తమన్నా.

తన కెరీర్ మరింత బాగా ఎదగాలంటే ఏం చేయాలో చెప్పమని వారి సలహా కోరిందట తమన్నా. అంతా విన్న ఆ న్యూమరాలజీ నిపుణులు పేరు మార్చేసుకుంటే నీ దశ తిరిగిపోతుందని చెప్పారట. దాంతో తన పేరు మార్చేసుకుంది మన తమన్నా. ఇంతకీ కొత్త పేరు ఏంటో చెప్పలేదు కదూ. తమన్నా కొత్తపేరు తమన్నా.

పాత పేరునే రెండోసారి చెప్పి పేరు మార్చుకుందని ఇంత పెద్ద స్టోరీ రాస్తారా అని విసుక్కోకండి. తమన్నా పేరు మార్చుకుందంటే పూర్తిగా కొత్తపేరు పెట్టేసుకుందని కాదు. ఉన్న పేరుకే కొన్ని అక్షరాలను అదనంగా చేర్చుకుంది. అదండీ సంగతి.

ఇలా పేరులోని అక్షరాలను మార్చుకున్న (చేర్చుకున్న) తమన్నా ఈ మధ్య ఓ తమిళ చిత్రం షూటింగ్ సందర్భంగా తన పేరు ఇంగ్లీషులో రాసేటప్పుడు మారిన అక్షరాలను చేర్చి రాయాలని కోరిందట. అయినా మనం తమన్నా పేరు రాసేది తెలుగులో కదా. కాబట్టి మనం కొత్తగా ఏ అక్షరాలు చేర్చుకోవాల్సిన అవసరం లేదులేండి.
మరిన్ని
దశావతారం పంక్షన్‌లో అసభ్యకర డ్రస్: మల్లికపై కేసు
ఆ వెబ్‌సైట్లకు 'A' నీతి నియమాల్లేవ్
ఆమె వచ్చి చేసేదేముంది.. కెమేరాలకు ఫోజులివ్వటమేగా...
కాజల్ బాగా బెట్టు చేస్తోంది: నిర్మాతల ఆరోపణ
రాజకీయమంటే అర్ధం కూడా తెలియదు: మహేష్‌బాబు
హాలీవుడ్ చిత్రం కోసం బెల్లీడాన్స్: శ్రియ