రాష్ట్రంలో మండుతున్న ఎండలతో పగలే కాకుండా రాత్రిల్లో సైతం ప్రజలకు ఉక్కపోత తప్పడంలేదు. ఎందుకంటే అస్తమానం కరెంటుకోత వేధిస్తుండడంతో రాత్రిపూట సైతం ఇళ్లల్లో కరెంటు ఉండడం లేదు. దీంతో ఫ్యాన్లు తిరగక పాపం జనాలు నిద్ర పోవడం లేదు.
ఇలాంటి కరెంటు కష్టమే తాజాగా నమితను సైతం ఇబ్బంది పెట్టింది. కరెంటు పోతే నమిత ఇంట్లో జనరేటర్ ఉంటుంది కదా. మరి నమితకు కరెంటు కష్టాలు ఏంటి అని ఆశ్చర్యపోవద్దు. నమితకు వచ్చిన కష్టం కరెంటు పోవడం వల్ల కాదు.
అసలు విషయం ఏంటంటే తమిళంలో బాగా బిజీగా ఉంటోన్న నమిత చెన్నైలో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఈ మధ్య ఓ రోజు రాత్రి నమిత నిద్రపోవడానికి తన రూంలోని ఏసీ అన్ చేసిందట. అంతే ఆ ఏసీలోంచి ఒక్కసారిగా మంటలు రావడంతో పాపం నమిత చాలా భయపడిపోయిందట.
అంతేనా ఆ ఏసీలోంచి వచ్చిన పొగలు రూం మొత్తాన్ని చుట్టేయడంతో భయంతో నమిత కేకలు పెట్టేసిందట. దీంతో నమిత అరుపులు విని పనివాళ్లు వచ్చి ఏసీ మంటల్ని అదుపు చేశారట. అయితే మంటలు పోయినా ఆరోజు రాత్రి మాత్రం నమిత నిద్రపోలేదట.
ఈ విషయం తెలిసిన ఇరుగుపొరుగువారు సినిమాలో నమితను చూచి ప్రేక్షకులు వేడెక్కిపోయినట్టే రూంలోని ఏసీ కూడా ఆమెను చూసి బాగా వేడెక్కిపోయి ఉంటుందని గుసగుసలాడేసుకున్నారట. అయినా ఏసీ కాలిపోయి నమిత బాధపడుతుంటే వాళ్లకు ఇలాంటి గుసగుసలు అవసరమా చెప్పండి.