ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'దశావతారం'పై వీహెచ్‌పీ గరంగరం
Dasavatharam
FileFILE
కమల్‌హసన్ పది విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం దశావతారం. ఆస్కార్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమల్ స్వయంగా కథ,మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తుండడం విశేషం.

గత రెండేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియో గత నెల 25న మార్కెట్‌లోకి విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఓ వివాదం చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది.

అదేంటంటే ఈ చిత్రంలో 16వ శతాబ్ధంలో శైవ, వైష్ణవుల మధ్య జరిగినట్టుగా చెప్పబడే గొడవలను చిత్రీకరించారట. ఈ గొడవల సందర్భంగా అనేక హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసమైనట్టుగా చూపించారట.

ఈ దృశ్యాలు హిందూ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని కాబట్టి ఈ దృశ్యాలను చిత్రం నుంచి తొలగించాలని వీహెచ్‌పీ డిమాండ్ మొదలుపెట్టింది. ఒకవేళ ఈ దృశ్యాలను కనుక చిత్రం నుంచి తొలగించకపోతే చిత్రం విడుదలను అడ్డుకుంటామని కూడా వీహెచ్‌పీ హెచ్చరించింది.

గతంలో ఐశ్వర్యారాయ్, హృతిక్‌రోషన్ జంటగా నటించిన జోథా అక్బర్ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని ఆ చిత్రం విడుదలను కొన్ని వర్గాలు అడ్డుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ప్రస్తుతం దశావతారం చిత్రంపై కూడా అలాంటి విమర్శలే ప్రారంభమయ్యాయి. ఈ రకమైన విమర్శల వల్ల ఎవరు ఎలాంటి లాభం పొందుతారో తెలియదు గానీ, ఇది కూడా ఓ రకమైన పబ్లిసిటీనే అని కొందరు గుసుగుసలాడేసుకుంటున్నారు.
మరిన్ని
'జల్సా' చేస్తున్నా 'పులి'పైనే అభిమానుల ఆశలు
నమితకు నిద్రలేని రాత్రి: కారణం ఏమిటి... ?
నా పేరు మారింది కాస్త గుర్తుంచుకోండి: తమన్నా
దశావతారం పంక్షన్‌లో అసభ్యకర డ్రస్: మల్లికపై కేసు
ఆ వెబ్‌సైట్లకు 'A' నీతి నియమాల్లేవ్
ఆమె వచ్చి చేసేదేముంది.. కెమేరాలకు ఫోజులివ్వటమేగా...