ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చెన్నైకి దూరంగా న్యూజిలాండ్‌లో పుట్టిన త్రిష
Trisha
WD PhotoWD
త్రిష న్యూజిలాండ్‌లో పుట్టడమేంటని ఆశ్చర్యపోకండి. న్యూజిలాండ్‌లో పుట్టడమంటే ఈ ఏడాది త్రిష తన పుట్టినరోజును న్యూజిల్యాండ్‌లో జరుపుకుంది. ప్రతి ఏడాది చెన్నైలో తన సన్నిహితులు, అభిమానుల మధ్య పుట్టినరోజును జరుపుకునే త్రిష ఈసారి మాత్రం ఆ ఛాన్స్ మిస్సయ్యింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాష్ హీరోగా రూపొందుతోన్న బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై చిత్రంలోని పాటలను ప్రస్తుతం న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న త్రిష ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉంటోంది.

ఈ తరుణంలో గత ఆదివారం త్రిష పుట్టినరోజు కావడంతో న్యూజిలాండ్‌లోని బుజ్జిగాడు యూనిట్‌తోనే త్రిష తన పుట్టినరోజును జరుపుకుందట. అయితే ప్రతిసారి చెన్నైలో అభిమానుల మధ్య జరుపుకే పుట్టినరోజు ఇలా దూరంగా జరుపుకోవాల్సి రావడంతో త్రిష కాస్త ఫీలైపోయిందట.

కానీ తాను లేకున్నా తన అభిమానులు మాత్రం తన పుట్టినరోజును ఘనంగానే జరుపుకున్నారని త్రిష చెప్పుకొచ్చింది. అంతేనా తమిళంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించిన కురువి చిత్రం సైతం శనివారం విడుదలవడంతో ఆమె అభిమానులు చాలా ఖుషీగా ఉన్నారని సమాచారం. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ త్రిషకు ఇప్పుడు వయస్సెంతో చెప్పనేలేదు కదూ. త్రిషకు ఈ పుట్టినరోజుతో 26ఏళ్లు నిండాయట.
మరిన్ని
నేను ప్రేమలో పడ్డ మాట నిజమే: విశాల్
'దశావతారం'పై వీహెచ్‌పీ గరంగరం
'జల్సా' చేస్తున్నా 'పులి'పైనే అభిమానుల ఆశలు
నమితకు నిద్రలేని రాత్రి: కారణం ఏమిటి... ?
నా పేరు మారింది కాస్త గుర్తుంచుకోండి: తమన్నా
దశావతారం పంక్షన్‌లో అసభ్యకర డ్రస్: మల్లికపై కేసు