1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

సానియా టచ్‌లో షాహిద్: బాలీవుడ్‌లో పుకార్లు

బాలీవుడ్‌ చిత్రపరిశ్రలో యంగ్ హీరోగా అందరికీ తెలిసిన షాహిద్‌కపూర్ ప్రస్తుతం
బాలీవుడ్‌ చిత్రపరిశ్రలో యంగ్ హీరోగా అందరికీ తెలిసిన షాహిద్‌కపూర్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇటీవల ఓ షూటింగ్‌లో జరిగిన చిన్న ప్రమాదంతో షాహిద్ కొన్నిరోజులుగా ఏ షూటింగ్‌లో పాల్గొనడం లేదట.

అయితే ఇంట్లో ఊరికినే కూర్చుంటే బోర్ కొట్టేస్తోందని షాహిద్ ఫోన్‌లో ఓ అమ్మాయితో టచ్‌లో ఉంటున్నాడట. ఆ అమ్మాయి ఎవరో కాదు టెన్నీస్ బ్యూటీ క్వీన్ సానియా మీర్జానట. అయితే సినిమా హీరోకి టెన్నీస్ బ్యూటీకి మధ్య స్నేహం ఎలా కుదిరిందని ఆశ్చర్యపోకండి.

సానియా ముంబై వచ్చినపుడు అహ్మద్‌ఖాన్ అనే ఆయన ఇంటికి వెళ్లడం అలవాటట. ఆ అహ్మద్‌ఖాన్ సానియాకే కాక షాహిద్‌కు కూడా మంచి మిత్రుడట. దాంతో అహ్మద్‌ఖాన్ ద్వారా సానియాతో షాహిద్‌కు దోస్తీ కుదిరిందట.

అదిగో అప్పటి నుంచి వీరు రెగ్యులర్‌గా ఫోన్‌ టచ్‌లో ఉంటున్నారని బాలీవుడ్ వర్గాల భోగట్టా. అంతేనా సానియా ముంబై వచ్చిన ప్రతిసారి అహ్మద్ ఇంట్లో షాహిద్‌ను కలుసుకుంటారట. ఇలా సానియాతో ఏర్పడిన పరిచయాన్ని షాహిద్ ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల తాజా సమాచారం.

మాజీ ప్రియురాలు కరీనా కపూర్‌తో విడిపోయిన తర్వాత షాహిద్ మరో అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడంటూ బాలీవుడ్‌లో ఈ గుసగుసలు మొదలయ్యాయి. చివరికి ఆ అమ్మాయి సానియానే అని తెలిసి వారు ఆశ్చర్యపోతున్నారట. ఇందులో కొసమెరుపేమిటంటే.. కరీనా-షాహిద్ ప్రేమ కూడా అహ్మాద్ ఖాన్ ఇంట్లోనే చిగురించడం విశేషం.