1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఆమె వద్దు... నేనే నీకు ముద్దు: కత్రినా

ఆమె వద్దు నేనే నీకు ముద్దు కత్రినా సల్మాన్ పక్కన మరెవరూ
WD PhotoWD
కండల హీరో సల్మాన్‌‌ఖాన్‌పై కత్రినాకైఫ్‌కి రోజురోజుకు ప్రేమ అధికమై పోతోందని బాలీవుడ్‌ కోడై కూస్తోంది. సల్మాన్‌పై కత్రినాకు ప్రేమ ఎంతలా పెరిగిపోయిందంటే తాను తప్ప సల్మాన్ పక్కన మరెవరూ ఉండరాదనే స్థాయిలో ఆమె ప్రవర్తిస్తోందని బాలీవుడ్ సమాచారం.

కత్రినాకు సల్మాన్‌పై పెరిగిపోయిన ప్రేమకు నిదర్శనంగా తాజాగా ఓ విషయం జరిగింది. అదేంటంటే కొన్నిరోజుల క్రితం కత్రినా తన చెల్లెల్ని కూడా హీరోయిన్‌ని చేయాలని ప్రయత్నాలు ప్రారంభించిందట. దీంతో ప్రియురాలికి సాయం చేయడానికి సల్మాన్ సైతం కత్రినా చెల్లెలికి సినిమా ఛాన్స్‌ల కోసం తనవంతు ప్రయత్నాలు ప్రారంభించాడట. ఇందులో భాగంగా తాను నటించే ఓ చిత్రంలో కత్రినా సోదరికి హీరోయిన్‌గా ఓ అవకాశం ఇవ్వమని సల్మాన్ ఆ చిత్ర నిర్మాతను కోరాడట.

ఇందుకు ఆ చిత్ర నిర్మాత కూడా అంగీకరించాడట. అయితే ఈ విషయం తెలియగానే కత్రినా తన చెల్లెల్ని లండన్ పంపించేసిందట. అంతేనా ఎందుకు మీ చెల్లెల్ని లండన్ పంపించేశావంటే దానికి అప్పుడే సినిమాలు అవసరం లేదని కోపంగా చెప్పిందట. అయితే తన ప్రియుడు సల్మాన్‌తో తన చెల్లెలు హీరోయిన్‌గా నటించడం ఇష్టం లేకనే కత్రినా ఇలా చేసిందని కొందరు చెబుతున్నారట.

ఎందుకని వారినే ప్రశ్నిస్తే తన ప్రియుడు ఎక్కడ తన చెల్లెలి మోహంలో పడి తనను వదిలేస్తాడో అన్న భయంతోనే కత్రినా ఇలా చేసిందని చెప్పుకొచ్చారు. ఈ విషయం వింటుంటే అబ్బో కత్రినాకి సల్మాన్ అంటే ఎంత ప్రేమో అనిపిస్తోంది కదూ. అవును మరి అంత ప్రేమ ఉండబట్టే ఆమధ్య నలుగురిలో సల్మాన్ తనపై చేయిచేసుకున్నా కత్రినా ఏమాత్రం ఫీల్‌ కాకుండా ఉండగలిగింది.