1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

నేను ఎవర్నీ ప్రేమించడం లేదు: ప్రియామణి

ఎవర్నీ ప్రేమించడం లేదు ప్రియామణి
WD PhotoWD
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో 'యమదొంగ'లో నటించినా అంతగా పేరురాని ప్రియమణి ప్రస్తుతం తమిళంలోనే తన అదృష్టాన్ని వెతుక్కొంటోంది. మొదట్లో కాస్త పద్ధతిగా నటిస్తూ వచ్చిన ప్రియామణి అవకాశాలు అంతగా రాకపోవడంతో ఎక్స్‌ఫోజింగ్‌కు సైతం సై అంటోంది.

అలా ప్రియామణి కాస్త గ్లామరస్‌గా విశాల్‌తో నటించిన భయ్యా చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిత్రం విడుదలయ్యాక విశాల్‌కు ప్రియామణికి మధ్య ఏదో ఉందంటూ తమిళ పరిశ్రమలో గుసగుసలు వినిపించాయి. కానీ తనకు ప్రియామణికి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని విశాల్ తాజాగా స్పష్టం చేశాడు.

మరి ప్రియామణి ప్రియుడు ఎవరై ఉంటారో అని ఓ తమిళ పత్రిక ఆమెనే స్వయంగా అడిగేసిందట. దాంతో ప్రియామణి తనకు ప్రేమికుడు ఎవరూ లేదని... అయితే తెలుగులో ఓ హీరో మాత్రం తనకు మంచి స్నేహితుడని సెలవిచ్చిందట. తాను హైదరాబాద్‌కు వెళ్లిన ప్రతిసారి అతన్ని కలుసుకుంటానని కూడా చెప్పిందట.

అంతేనా తమ మధ్య ఉన్నిది మాత్రం స్నేహమే తప్ప మరేమీ కాదని కూడా ఈ అమ్మడు తేల్చేసిందట. ఇంతకీ ప్రియమణి తన ఫ్రెండ్ అంటూ చెప్పింది మరెవరో కాదు హీరో రాజానే. అయితే తాము అడక్కుండానే రాజా గురించి చెప్పిందంటే వీళ్ల మధ్య ఎదో ఉందని వాళ్లు మళ్లీ చెప్పకోవడం ప్రారంభించారట.