బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా కొనసాగుతోన్న బిపాషా బసు ప్రస్తుతం సినిమాలతో పాటు బిజినెస్‌కు సంబంధించిన పనుల్లో కూడా బిజీగా ఉంటోందట. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తన బిజినెస్ పనుల కోసం కూడా కొంత సమయం కేటాయిస్తోందట ఈ అమ్మడు.
ఇటీవల నటించిన రేస్ చిత్రం మంచి విజయం సాధించడంతో తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిన బిపాషా సంపాదించే సొమ్మును ఇప్పటినుంచే భద్రపరచడం ప్రారంభించిందట. ఇందుకోసం తన ప్రియుడు జాన్ అబ్రహాంతో కలిసి వ్యాపారం మొదలు పెట్టాలని బిపాషా ప్రయత్నాలు చేస్తోందట.
ఇంతకీ ఏం బిజినేస్ చేయనున్నారని బిపాషాను ప్రశ్నిస్తే మంచి వాతావరణంతో కూడిన ఓ హై క్లాస్ రెస్టారెంట్‌ని ప్రారంభించనున్నామని చెప్పుకొచ్చింది. అయితే మీకు జాన్ అబ్రహాంకి మధ్య గొడవలొచ్చాయని, మీరు విడిపోయారని చెప్పుకుంటున్నారు కదా, అని ప్రశ్నిస్తే... అవంతా గిట్టనివారు చేస్తున్న ప్రచారం అని కొట్టిపారేసింది.
అంతేకాదు తాము ఇప్పటికీ కలిసే ఉన్నామని కూడా చెప్పింది. అబ్రహాం సూచన మేరకే ఈ హోటల్ నిర్మాణాన్ని కూడా ప్రారంబిస్తున్నానని బిపాషా చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి బిపాషా జాన్ అబ్రహాంలు విడిపోలేదని తెలుస్తోందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
|