ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అభిమానులను ఆకర్షించడానికి ముమైత్ ప్రయత్నాలు
Mumaith
WD PhotoWD
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' అంటూ 'పోకిరి' చిత్రంతో ఆంధ్రావనిని ఓ ఊపు ఊపిన ముమైత్‌ఖాన్ అటుపై వెనక్కు తిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు. ఐటం సాంగులతో తన కెరీర్‌ను మొదలు పెట్టిన ముమైత్‌ అందచందాలకు రెచ్చగొట్టే భంగిమలకు పడిపోయిన చాలామంది అమెకు వీరాభిమానులుగా మారారు.

దాంతో ముమైత్‌ ఐటం సాంగ్‌ ప్రతి చిత్రంలో రావడం మొదలైంది. ఇక్కడితో ఆగిపోకుండా నిర్మాతలు ముమైత్‌ ప్రధాన పాత్రతో చిత్రాలు నిర్మించడానికి సైతం సిద్ధమయ్యారు. అలా 'మైసమ్మ ఐపీఎస్', 'మంగతాయారు టిఫిన్ సెంటర్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అలాగే ముమైత్ ప్రధాన పాత్రలో నటించనున్న మరో రెండు చిత్రాలు సైతం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

అయితే ఏమైందో తెలియదు కానీ ముమైత్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రాలకు అంతగా ఆదరణ లభించలేదు. ముమైత్ ఒంపుసొంపలే ప్రధానాంశంగా ఓ వర్గం ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని తీసిన ఈ చిత్రాలు ఆడకపోయే సరికి ముమైత్‌కు దిక్కుతోచడం లేదట. ఇలా జరగడానికి కారణమేమని విచారిస్తే గతంలో ఆకర్షించినంతగా ముమైత్ ఒంపుసొంపులు ప్రస్తుతం ఆకర్షించడం లేదని తెలిసిందట.

దీంతో తన ఒంపుసొంపుల్ని మరింత ఆకర్షవంతంగా తీర్చిదిద్దుకోడానికి ముమైత్ ప్రయత్నాలు మొదలు పెట్టిందట. తనలో ప్రేక్షకులకు నచ్చింది తన ఒంపుసొంపులే కాబట్టి వాటిని ఎలా అందంగా తీర్చిదిద్దాలన్న విషయమై ముమైత్ ఎక్స్‌పర్ట్స్‌ని సంప్రదించిందట.

అంతేనా వారి సూచనల మేరకు ప్రత్యేకమైన ఎక్సర్‌సైజులు సైతం ప్రారంభించిందట. సో రాబోయే రోజుల్లో మరింత ఆకర్షణీయమైన ముమైత్‌ఖాన్‌ని ప్రేక్షకులు చూడనున్నారన్నమాట.
మరిన్ని
బిజినెస్‌ కోసం జాన్‌అబ్రహాంతో బిపాషా బిజీబిజీ
నేను ఎవర్నీ ప్రేమించడం లేదు: ప్రియామణి
ఆమె వద్దు... నేనే నీకు ముద్దు: కత్రినా
అసిన్ కోసం అభిమానుల ఎదురుచూపులు
సానియా టచ్‌లో షాహిద్: బాలీవుడ్‌లో పుకార్లు
వ్యక్తిగత కక్షతోనే ప్రచారకర్తగా తొలగించారు: నయనతార