అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన అశిన్ అటుపై పలు హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత గజని చిత్రంతో తమిళంలోనూ బాగా బిజీ అయ్యింది. దాంతో తమిళంలో అశిన్‌కు ఛాన్స్‌లు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం కమల్‌హసన్ హీరోగా రూపొందుతోన్న దశావతారం చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అదేసమయంలో అశిన్‌కు తమిళంలో మంచి పేరు తెచ్చిన గజని చిత్రం హిందీ రీమేక్‌లోనూ తానే హీరోయిన్‌గా నటిస్తోంది.
దీంతో అశిన్ ప్రస్తుతం ముంబయిలో మకాం పెట్టింది. అయితే ముంబయికి చేరిన అశిన్ అక్కడే స్ధిరపడిపోయిందని ఇక దక్షిణాది చిత్రాల్లో నటించదన్న రూమర్లు ఆ మధ్య వెల్లువెత్తాయి. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని మీ చెంతే ఉన్నానని అశిన్ చెబుతోంది.
తాజాగా ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశిన్ మాట్లాడుతూ దక్షిణాది చిత్రసీమ తనకు తల్లిలాంటిదని, తల్లిని వదిలేసి ఎవరైనా వెళ్లారా అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈమధ్య తెలుగు, తమిళ చిత్రాల్లో కనిపించడం లేదని ప్రశ్నిస్తే దశావతారం విడుదలైతే అభిమానుల అనుమానాలు తీరిపోతాయని సెలవిచ్చింది.
అయితే ప్రస్తుతం మీరు ఏయే చిత్రాల్లో నటించనున్నారంటే త్వరలో తమిళంలో ఓ పెద్ద బ్యానర్ చిత్రంలోను, హిందీలోను ఓ పెద్ద బ్యానర్ చిత్రంలో నటించనున్నాని వివరించింది.
హిందీ గజినిలో నటిస్తున్న మీకు ఆ చిత్రం హీరో అమీర్‌ఖాన్‌తో మీ అనుభవం ఎలా ఉందంటే ఆయన గొప్పనటుడని, ఆయనతో నటించడం గొప్ప అదృష్టమని చెప్పింది.
మీరు హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్తున్నారట అన్న ప్రశ్నకు అవును గజినీ చిత్రంలో తన డైలాగులు తానే చెబుతున్నానని ముద్దు ముద్దుగా చెప్పింది. అశిన్ చెప్పిన విషయాలు చూస్తుంటే త్వరలో మళ్లీ దక్షిణాదిలో ఆమె హవా ప్రారంభమవుతుందేమో వేచి చూడాలి మరి.
|