ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సిమ్రాన్‌ సినిమా కష్టాలు
Simran
WD PhotoWD
కొన్నాళ్ల క్రితం వరకు తెలుగు, తమిళ చిత్రాల్లో ఓ ఊపు ఊపిన సిమ్రాన్‌కు పెళ్లైన తర్వాత సినిమా కష్టాలు ప్రారంభమైనాయి. పెళ్లై ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్‌కు ఎందుకో కలిసి రాలేదు.

తను ఆంటీ అయిపోయిన విషయాన్ని సింబాలిక్‌గా చెప్తూ కృష్ణభగవాన్ హీరోగా వచ్చిన జాన్ అప్పారావులో సిమ్రాన్ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే కృష్ణభగవాన్ కామెడీ కానీ, సిమ్రాన్ ముదర అందాలు కానీ ఈ చిత్రాన్ని ఏమాత్రం కాపాడలేకపోయాయి. దీంతో ఇక తెలుగులో తనకు కుదరదనుకున్న సిమ్రాన్ తట్టా బుట్టా సర్దుకుని తమిళంలోకి చేరిపోయింది.

అయితే అక్కడ కూడా అవకాశాలు దొరికే ఛాన్స్ లేదని తేలడంతో ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా అవతారమెత్తింది. ఇలా సాగిపోతున్న సిమ్రాన్‌కు భరత్ చిత్రంలో అవకాశం లభించింది. భరత్ అంటే ఎవరో కాదండీ ఆమధ్య వచ్చిన ప్రేమిస్తే చిత్రంలో హీరోగా కనిపించాడు చూడండి అతనే.

హీరోగా తమిళంలో మంచి పేరున్న భరత్ చిత్రంలో అవకాశమంటే సంతోషపడాల్సిన విషయమే కదా అనుకుంటే అసలు విషయం తర్వాత తెలిసింది. ఈ చిత్రంలో సిమ్రాన్ కనిపించబోయేది హీరోయిన్‌గా కాదట. దాదాపు అక్కలాంటి కెరెక్టర్‌లోనట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూనమ్ భజ్వా నటిస్తోందట.

ఇక హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని తెలియడంతోనే సిమ్రాన్ ఇలాంటి పాత్రలకు సైతం పచ్చ జెండా ఊపేస్తోందని కొందరు చెప్పుకుంటున్నారట. తన బొడ్డు అందాలతో గతంలో ప్రేక్షకులను ఓ ఊపు ఊపిన సిమ్రాన్‌కు ఎంత కష్టమెచ్చిందని మరికొందరు చెప్పుకుంటున్నారట.

ఏది ఏమైనా హీరోలు ఎంత ముదిరిపోయినా చూసే ప్రేక్షకులు హీరోయిన్‌లకు పెళ్లైతే చాలు వారిని చూడడం మానేస్తారు. పాపం మన హీరోయిన్లు.
మరిన్ని
నేను మీ చెంతనే ఉన్నా: అశిన్
ప్రేమంటే జీవితం: జెనీలియా
దీపిక కొంపముంచిన ఆనాటి సంఘటనలు
అభిమానులను ఆకర్షించడానికి ముమైత్ ప్రయత్నాలు
బిజినెస్‌ కోసం జాన్‌అబ్రహాంతో బిపాషా బిజీబిజీ
నేను ఎవర్నీ ప్రేమించడం లేదు: ప్రియామణి