నవనీత్‌కౌర్ చెబుతున్న హిట్ కబుర్లు
|
ఇనాళ్లు తాను చిన్న హీరోల ప్రక్కన నటించడం వల్లే తనకు గుర్తింపు రాలేదని విజయకాంత్ లాంటి పెద్ద హీరోతో చేయడం వల్లే ప్రేక్షకులు తనను గుర్తించారని నవనీత్ తెగ ఆనందపడిపోతోంది. అంతేకాదు ప్రస్తుతం తాను మూడు తెలుగుచిత్రాల్లోను, కన్నడంలో ఓ చిత్రంలోను, పంజాబీలోను, మలయాళంలో కూడా నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.
దీంతో మొన్నటి వరకు గోళ్లు గిల్లుకొంటున్న నవనీత్‌కు ఇన్ని అవకాశాలు ఎప్పుడు లభించిందా అని వినే వాళ్లు ఆశ్చర్యపోతున్నారట. ఎందుకంటే తాజాగా నవనీత్ నటించిన భూమ చిత్రం ఏమైందో తెలియదు. దీంతో ఓ టీవీ కార్యక్రమంలో హాట్‌హాట్‌గా డాన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ అమ్మడు హటాత్తుగా తాను బిజీ అని చెబితే ఎవరికైనా నమ్మడం కష్టమే కదా.
