'యమదొంగ'లో 'అబయా' అంటూ ఎన్టీఆర్‌తో వయ్యారాలు వలకబోసిన మమతామోహన్‌దాస్ ఆ చిత్రం హిట్‌తో బాగా బిజీగా మారిపోయింది. అంతేనా అడపదడపా పాటలు పాడే ఈ చిన్నది సింగర్‌గా కూడా మంచి మార్కులే కొట్టేసింది. హస్కీ వాయిస్‌తో మమతామోహన్‌దాస్ పాడిన అన్ని పాటలు సూపర్‌హిట్టే.
తొలుత ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రంలోని టైటిల్ పాటను పాడిన ఈ అమ్మడు ఆ తర్వాత జగడం, శంకర్‌దాదా, యమదొంగ చిత్రాల్లో సైతం పాటలు పాడింది. అయితే మమతలో ఉన్న టాలెంట్‌ని గుర్తించి సింగర్‌గా పరిచయం చేసిన సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌కు ఆమెకు మధ్య ఏదో బాడీ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతోందనే గుసగుసలు వినిపించాయి.
ఈ విషయం గురించి మమతను కదిలిస్తే శాస్త్రీయ సంగీతమంటే ఇష్టమున్న నాకు పాడడం హాబీగా ఉండేది. అలా అప్పుడప్పుడు కూని రాగాలు తీసే నా గొంతు నచ్చడంతో దేవీశ్రీ ప్రసాద్ పాడే ఛాన్స్ ఇచ్చారు. అలా నేను సింగర్‌గా కూడా పరిచయమైయ్యాను. అంతమాత్రాన దేవీశ్రీకి నాకు మధ్య ఏదో ఉందని అంటే ఎలా చెప్పండి అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
దేవీశ్రీతో నాకు ఉన్నది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని మమతా చెప్పుకొచ్చింది. దేవీశ్రీతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని వృత్తి పరంగా అతను చాలా యాక్టివ్‌గా ఉంటాడని మమత కితాబిచ్చింది.
సంగీత దర్శకులు చాలా మందిని సింగర్‌లుగా పరిచయం చేస్తుంటారు కానీ తనకు దేవీశ్రీకి మధ్య సంబంధం గురించి రూమర్లు రావడానికి కారణం తాను యాక్టర్ కావడమేనని చెప్పింది. అయితే ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉన్నానని కాబట్టి ఇలాంటి రూమర్ల గురించి పట్టించుకునే తీరిక తనకు లేదని ముగించింది.
|