'శివాజీ' విజయంతో విపరీతమైన పబ్లిసిటీ కొట్టేసిన శ్రేయ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయింది. అంతేనా బాలీవుడ్‌లో సైతం శ్రేయ రెండు చిత్రాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే దక్షిణాదిలో మాత్రం శ్రేయ నటిస్తున్న చిత్రాలేవీ ప్రస్తుతం కన్పించడం లేదు.
విక్రమ్ హీరోగా తమిళ, తెలుగ భాషల్లో రూపొందుతోన్న మల్లన్న చిత్రం తప్ప శ్రేయ నటించే చిత్రాలేవీ దరిదాపుల్లో లేకపోవడం విశేషం. అంతేకాదు టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు కూడా శ్రేయను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనికంతటికీ కారణం శ్రేయనే అని నిర్మాతలు చెబుతున్నారట.
తమిళ, తెలుగు చిత్రాల్లో వచ్చే అవకాశాల్ని శ్రేయానే కాదని చెప్పేస్తోందట. ఆఫర్లు వస్తున్నా వద్దంటున్న శ్రేయ ఓపెనింగులు, ప్రారంభోత్సవాలకు మాత్రం సై అంటోందట. సినిమాలు వద్దని కార్యక్రమాలకు, షాపుల ఓపెనింగుకు, బ్రాండ్ ప్రమోషన్లకు చూపించే ఉత్సాహం సినిమాలకు ఎందుకు చూపించడం లేదని శ్రేయను కొందరు అడిగితే అదిరిపోయే సమాధానమిచ్చిందట.
బికినీలు వేసుకుని కెమెరా ముందు ఎగిరితే వచ్చే సొమ్ము కన్నా ఇలాంటి కార్యక్రమాల వల్లే ఎక్కువ లభిస్తోందని శ్రేయ చెప్పుకొచ్చిందట. ఒంటికి కష్టం కలగకుండా సొమ్ము లభిస్తుంటే సినిమాల కోసమని నేనెందుకు కష్టపడాలి అంటూ సెలవిచ్చిందట.
ఈ మాటలు విన్నవారు నిజమే మరి... శ్రేయకు కూడా వయస్సైపోతోంది కదా. అందుకే కాబోలు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకొంటోందని అనుకున్నారట.
|