అమీర్‌ఖాన్ కాళ్ల వద్ద షారూక్‌ఖాన్ అని అనగానే ఆశ్చర్యపోవద్దు. షారుక్ తన కాళ్ల వద్దకు వచ్చి నాకుతూ ఉంటాడని అమీర్‌ఖాన్ పేర్కొన్నాడు. స్వయంగా కాదులేండి. తన బ్లాగులో రచనల సందర్భంగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. అమీర్‌ఖాన్ పేర్కొన్న షారుక్ బాలీవుడ్ హీరో కాదు అమీర్ ఇంట్లో ఉన్న ఓ కుక్క. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం గజనీ చిత్రంలో నటిస్తున్న అమీర్‌ఖాన్ ఆ షూటింగ్ సందర్భంగా గాయపడి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.
ఈ సమయంలోనే అమీర్ ఓ ఇంటిని కోనుగోలు చేశాడట. ఆ ఇంట్లో ఉంటున్నదే ఈ షారూక్ పేరుగల కుక్క. అయితే అమీర్ ఇంటిని కోనుగోలు చేసినప్పటినుంచి ఆ షారుక్ అనే పేరుగల కుక్క అమీర్ దగ్గరే ఉంటోందట. అంతేనా అమీర్‌ను చూస్తే చాలట కాళ్లదగ్గరకు వచ్చి కాళ్లు నాకుతుందట. అమీర్‌ఖాన్ దానికి బిస్కట్లు వేస్తుంటాడట.
అబ్బో దాని దగ్గర ఒకటే వాసనట. అందుకే దానికి శుభ్రంగా స్నానం చేయండంటూ అమీర్ తన వాళ్లకు చెబుతుంటాడట... ఇలా ఉందండీ అమీర్‌ఖాన్ బ్లాగులోని వ్యాఖ్యలు. అయితే ఇది చదివిన వారికి చిర్రెత్తుకొస్తోందట. కుక్క పేరు షారుక్ అయినంత మాత్రాన ఆపేరుతో షారుక్ నాకాళ్ల దగ్గర అంటూ రాయడమేంటని వాళ్లు మండిపడుతున్నారట.
కొందరైతే గజినీలో పాత్రలాగా అమీర్‌కు మతికానీ చెలించిందా అని అంటున్నారట. ఎందుకంటే సాటి హీరోని రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అమీర్‌కు కొత్త కాదని గతంలోనూ షారూక్‌పై అతను ఇలాగే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని వాళ్లు అంటున్నారట.
ఏది ఏమైనా బ్లాగులో రాతల పేరుతో హీరోలు సైతం తమలోని విలన్ లక్షణాలను బయటపెట్టడం చూస్తుంటే పిదపకాలం పిదప బుద్ధులు అంటూ కొందరు విస్సుకుంటున్నారట.
|