బాలీవుడ్‌లో ప్రారంభమైన చిత్రపరిశ్రమ, మాఫియా సత్సంబంధాల చరిత్ర ఇప్పుడు టాలీవుడ్‌కు సైతం పాకిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నకిలీ పాస్‌పోర్ట్‌ల విషయంలో అబుసలేం, మోనికాబేడీలు తమ కార్యకలాపాలు ఇక్కడినుంచే నడిపారన్న వార్తలు బగ్గుమన్న విషయం తెలిసిందే. అదిగో అప్పటినుంచి టాలీవుడ్‌లోని కొందరు నటీనటులు సైతం మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నారనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి.
బాలీవుడ్‌లో హీరోయిన్లు మాఫీయా డాన్‌లతో సత్సంబంధాలు నెరపడం దానితో హీరోయిన్ల కోసం మాఫియా లీడర్లే సినిమా నిర్మాణంలోకి ప్రవేశించడం సర్వసాధారణంగా మారింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లోని కొందరు హీరోయిన్లు సైతం మాఫియాతో సత్సంబంధాలు నెరుపుతున్నారని ఓ ప్రముఖ వార్తా ఛానెల్ ఇటీవలే ఓ ప్రోగ్రాం సందర్భంగా పేర్కొంది.
అంతేనా ఆ హీరోయిన్లు మరెవరో కాదు కొద్దిరోజుల క్రితం హీరోయిన్‌గా చేసిన సాక్షిశివానంద్, ప్రస్తుతం సినిమాలు లేక గోళ్లు గిల్లుకుంటున్న గజాలానే అంటూ ఆ ఛానెల్ మరో బాంబు సైతం పేల్చింది. అయితే ఈ ప్రోగ్రాం సదరు ఛానెల్ ఒక్కసారి మాత్రమే ప్రసారం కావడం వల్ల ఎక్కువమంది వరకు ఈ విషయం చేరలేదు.
అయితే ఈ కార్యక్రమాన్ని చూచినవారు కొందరు మాత్రం ఆ టీవీ ఛానెల్‌ను సంప్రదిస్తే బాలీవుడ్ తరహా మాఫియా సంబంధాలు టాలీవుడ్‌కు సైతం చేరుతున్నాయన్న వార్తల ఆధారంగా తామీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని సమాధానమిచ్చింది.
అలాగే సాక్షిశివానంద్, గజాల మీద చేసిన ఆరోపణలు సైతం కొన్ని అనుమానాలే తప్పు బుజువులు కాదని తేల్చింది. అంతే తప్ప సదరు హీరోయిన్లకు ఏ మాఫియాతో సంబంధాలున్నాయన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.
|