ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'సల్మాన్‌' ప్రేమతో 'కత్రినా'కు పెరిగిన కష్టాలు  Search similar articles
katrinakaif
WD PhotoWD
ప్రేయసి కత్రినాకైఫ్ మీద కండల హీరో సల్మాన్‌ఖాన్ ప్రేమ రోజురోజుకు పెరిగిపోతోందట. అయితే సల్మాన్ ప్రేమను భరించలేక పాపం కత్రినాకు ఒళ్లు పులిసిపోతోందట. ప్రేమ ఎక్కువైతే సంతోషించాల్సింది పోయి బాధపడడమేంటి అని అప్పుడే స్టేట్‌మెంట్లు ఇచ్చేయకండి... పాపం కత్రినా కష్టాలు వింటే మీరు ఈ మాట అనకమానరు.

ఇంతకీ సంగతేంటంటే సల్మాన్‌ తన ప్రేమను కాపాడుకోవడానికి చాలా సిన్సియర్‌గా ట్రై చేస్తాడట. ఎంత సిన్సియర్‌గా ట్రై చేస్తాడంటే వీలుంటే ప్రేయసిని బుజ్జగించో లేకుంటే కాస్త చావకొట్టో మరీ ప్రేయసిపై తనకున్న ప్రేమను నిరూపించుకుంటాడట. అయితే సల్మాన్ ప్రేమ తమ వంటి మీద వాతల రూపంలో కనిపిస్తుంటే తట్టుకోలేని ప్రేయసి(లు) మాత్రం సల్మాన్ ప్రేమకు రాంరాం చెప్పేసి వెళ్లిపోతున్నారట.

ఇలా వీరలెవల్లో ప్రేమించే సల్మాన్‌ కొద్దికాలంగా కత్రినాకైఫ్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అసలే అందగత్తె అయిన కత్రినా ఎక్కడ తనకు దూరమౌతుందో అనుకున్న సల్మాన్ యధాప్రకారం తన ఘాటు ప్రేమను ఆమెకు సైతం రుచి చూపిస్తున్నాడట. ఈమధ్య వీరిద్దరు కలిసి చేస్తున్న ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా కత్రినా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సల్మాన్ ఆమె గదిలోకి వెళ్లి మరీ ప్రేమించడం మొదలు పెట్టాడట.

అయితే ఇద్దరు ప్రేమికులు గదిలో ఉంటే ముద్దు ముచ్చట్ల శబ్ధం వినిపించాల్సింది పోయి బయట ఉన్నవాళ్లకు కత్రినా ఏడుపులు, అరుపులు వినిపించాయట. దీంతో సల్మాన్ కాస్త ఘాటుగా ప్రేమిస్తున్నాడు కాబోలు అంటూ అక్కడున్న వారంతా వాళ్లని డిస్టర్బ్ చేయకుండా తమ పనులు తాము చేసుకోవడం ప్రారంభించారట.

అంతా జరిగి కొద్దిరోజులు గడిచాక విచారిస్తే ఆమధ్య ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కత్రినా మ్యాచ్ మధ్యలో అక్షయ్ కుమార్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిందట. ఇది తెలిసిన సల్మాన్‌కు తనలోని ప్రేమ తగ్గడం వల్లే కత్రినా అలా చేసిందేమోనన్న డౌట్ వచ్చిందట. అందుకే తన ప్రేమ పవర్‌ను షూటింగ్ మధ్యలో కత్రినాకు రుచి చూపించాడట.

కొద్దికాలం క్రితం ఓ కాఫీ క్లబ్‌లో నలుగురు చూస్తుండగానే కత్రినా చెంప చెల్లుమనిపించి మరీ సల్మాన్ తన ప్రేమను నిరూపించుకున్న సంగతి తెలిసిందే. ఇదంతా విన్న తర్వాత సల్మాన్ ప్రేమ భరించడం కష్టమే అని మీకైనా అనిపించడం లేదూ.
మరిన్ని
సాక్షికి మాఫియాతో సంబంధాలు: టాలీవుడ్‌ గుసగుసలు
తెలుగు వద్దు... తమిళమే ముద్దు: విక్రమ్
అమీర్‌ కాళ్ల వద్ద షారూక్‌: ఓ బ్లాగులో కథ
కరీనా ససేమిరా: హన్సికను వరించిన ఛాన్స్
వరుస విజయాలతో జోరుమీదున్న జెనీలియా
మలయాళంలో నయనతార స్పెషల్ డాన్స్