కత్రినాపై నెటిజన్లలో పెరిగిన క్రేజ్: సల్మాన్‌కు ఆనందం?
|
గతంలో ఐశ్వర్య ఫోటో ఎక్కడ కనిపించినా ఆసక్తిగా దాని డౌన్‌లోడ్ చేసుకునే నెట్ ప్రియులలో ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త తగ్గిందట. ప్రస్తుతం నెటిజన్లు ఐశ్వర్యకన్నా కత్రినా ఫోటోలంటేనే ఎగబడుతున్నారట. దీంతో ఇంటర్నెట్‌లో ఎక్కువ హిట్స్ పడుతున్న హీరోయిన్‌గా కత్రినా పేరు సంపాదించింది.
అయితే ఈ వార్త ఐశ్వర్యను బాధపెడుతుందో లేక కత్రినాను ఆనందపెడుతుందో తెలియదు కానీ... ఈ వార్త వింటే సల్మాన్ మాత్రం ఎగిరిగంతేస్తాడని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. అవునుమరి తన ప్రేయసిని అందగత్తె అని అందరూ మెచ్చుకుంటే ఏ ప్రియుడైనా ఆనందపడడం సహజమే మరి.
అయితే కత్రినాకు నెట్ హిట్స్ పెరిగాయని తెలిస్తే సల్మాన్ ఆనందపడేది అందుకు కాదట. మరి ఎందుకు అంటే... కత్రినాకు క్రేజ్ పెరిగిందన్న విషయం కన్నా తన మాజీ ప్రేయసి అయిన ఐశ్వర్యకు క్రేజ్ తగ్గడమే సల్మాన్‌ను ఎక్కువ ఆనందపరుస్తుందని వాళ్లు అంటున్నారు.
అప్పట్లో ఐశ్వర్య తనను వదిలేసినందుకు సల్మాన్ చాలా బాధపడ్డాడట. అందుకే ఐశ్వర్యమీద కోపంలో ఉన్న సల్మాన్‌కు ఈ విషయం తప్పక ఆనంద కలిగిస్తుందని వారు చెబుతున్నారు. వీళ్ల చోద్యం కాకపోతే ప్రేయసి మాజీ అయినా ఆమె బాధపడితే ఏ ప్రియుడైనా ఆనందిస్తాడా చెప్పండి ? అలాగే ఐశ్వర్య మీద ఎంత కోపం ఉన్నా ఆమెకు బాధ కలిగితే సల్మాన్ ఆనందించగలడా.... !
