గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » కమల్ దశావతారానికి మరో బ్రేక్
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సంచలన చిత్రం దశావతారం విడుదలకు మరో బ్రేక్ పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు హిందువులను అగౌరవ పరిచేలా ఉన్నాయని హిందూ మున్నని వేసిన దావాతో ఈ చిత్రం విడుదల వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి.

రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో అవాంతరాల మధ్య షూటింగ్ ముగించుకున్నప్పటికీ తెరమీదకు వచ్చే తేదీని మాత్రం నిర్మాత ఆస్కార్ ఫిలిమ్స్ రవిచంద్రన్ ప్రకటించలేకపోతున్నారు.

ఇటీవల చెన్నైలో ఆర్భాటంగా జరిగిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రముఖ హాలివుడ్ స్టార్ జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం సందర్భంగా జాకీచాన్‌తో కురచ దుస్తుల మల్లిక అతి సన్నిహితంగా వ్యవహరించిన తీరు సినీవర్గాల్లో కలకలం రేపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కమల్ దశావతారం బ్రేక్