1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

తెరంగేట్రానికి మరో స్టార్ తనయుడు

తెరంగేట్రం మరో స్టార్ తనయుడు
హీరోలు, దర్శకులు, నిర్మాతలూ...ఇలా సినీ రంగ ప్రముఖులందరూ తమ వారసులను రంగ ప్రవేశం చేయిస్తున్న తరహాలోనే తాజాగా మరి కొందరి పేర్లు బయట పడుతున్నాయి.

హీరో నాగార్జున తనయుడితో పాటు ఎమ్మెస్ రాజు, కోదండ రామిరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రిలు కూడా తమ తనయులను సినీరంగ ప్రవేశం చేయించాలనుకుంటుంటే తాజాగా ఆ జాబితాలో నాగబాబు కూడా చేరాడు.

ఆయన తనయుడు వరుణ్ హీరోగా ఓ చిత్రాన్ని సొంత బ్యానర్‌పై నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి దశరథ్ విన్పించిన కథ కూడా ఆయనకు నచ్చిందట.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ కథకు ఓకే అంటే త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం అందలేదు.
About Writer
Srinivasulu