అతిథి చిత్రం తర్వాత మహేష్‌బాబు కొంత గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అతడు'గా సూపర్‌హిట్ సాధించిన మహేష్‌బాబు ప్రస్తుతం 'వరుడు'?గా మనముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. శింగమల రమేష్ నిర్మాతగా త్రివిక్రమ్, మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది.
ఈ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్‌బాబు నటించబోయే చిత్రానికి మోహర్‌రమేష్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. దర్శకునిగా తొలిచిత్రంతోనే ఎన్టీఆర్ లాంటి పేరున్న హీరోతో మోహర్‌రమేష్ 'కంత్రీ' చిత్రాన్ని రూపొందించాడు. దీంతో అందరి దృష్టి మోహర్‌రమేష్‌పై పడింది.
ఈ తరుణంలో మహేష్‌బాబు హీరోగా మోహర్‌రమేష్ దర్శకత్వంలో చిత్రం అంటే ఇప్పటినుంచే ఆ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో విశేషమేంటంటే గతంలో మహేష్‌బాబు హీరోగా వచ్చిన 'బాబీ' చిత్రంలో మోహర్‌రమేష్ కూడా నటించాడు. దీంతో మహేష్‌బాబుతో నటించిన వ్యక్తి అతన్ని ఎలా డైరెక్ట్ చేయనున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.