గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » 'కుచేలుడు'కి రజినీకాంత్ గొంతు అందించేనా ?
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
రజినీకాంత్ కొత్త చిత్రం అంటే ఆయన అభిమానులకు అదో సంబరంలాంటింది. చిత్రం ప్రారంభం నుంచి విడుదలవరకు రజినీ సినిమా గురించి వచ్చే చిన్న వార్త అయినా ఆయన అభిమానులకు మాత్రం అది గొప్ప విషయమే. ప్రస్తతం ఆయన నటిస్తున్న కుచేలుడు చిత్రం గురించిన రోజుకో వార్త రజనీ అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది.

తెలగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ కుచేలుడు చిత్రంలో రజినీకాంత్ పాత్ర నిడివి తక్కువే. అయినా ఆ చిత్రం వ్యాపారం మొత్తం రజినీకాంత్ పేరు మీదుగానే జరుగుతోంది. ఆ చిత్రంలో రజనీకాంత్ ఓ సినిమా హీరోగా నటిస్తుండగా, జగపతిబాబు మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలోని ఓ పాటలో రజినీకాంత్ 20 గెటప్పుల్లో నటించనున్నారన్న వార్త నిన్నటి వరకు సంచలనాన్ని కలిగించింది. అలాగే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగు వెర్షన్‌లోని రజినీకాంత్ పాత్రకు ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారన్నదే ఆ వార్త.

గతంలో రజినీకాంత్ చిత్రాలు తెలుగులోకి ఆనువాదమైన ఆయన పాత్రకు వెరెవరో డబ్బింగ్ చెప్పేవారు. అందువల్ల తెలుగు అభిమానులకు రజనీకాంత్ గొంతు వినే అవకాశం లభించలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్త గనుక నిజమైతే తెలుగు అభిమానులు రజినీకాంత్ చిత్రంలో ఆయన గొంతును సైతం విని ఆనందించనున్నారన్నమాట.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కుచేలుడు రజినీకాంత్ గొంతు అందించేనా