నిషా తలకెక్కిందంటే తాగుబోతులు ఏం చేస్తారో వారికే తెలియదు. మామూలు సమయాల్లో పైకి ఎంత క్రమశిక్షణతో ఉన్నప్పటికీ 'చుక్క' పడితే చాలు...వారి నోట నుంచి నిజం తన్నుకుంటూ వస్తుంది. ఈ విషయంలో ఎవరూ మినహాయింపు కాదు.
ఇటీవల ముమైత్‌ఖాన్ విషయంలోనూ అదే జరిగింది. తెరపై బట్టలు పొదుపుగా వాడుతూ ప్రేక్షకులకు కిక్కెక్కించే ముమైత్‌ఖాన్ ఇటీవల హైదరాబాద్‌లోని సెవెన్త్‌హెవెన్ పబ్‌లో తానే కిక్కులో మునిగిపోయిందట. దీంతో ఏం చేస్తుందో కూడా తెలియని స్ధితిలో ముమైత్ ఒంటిమీద బట్టలు సైతం పీకిపారేసిందట. దీంతో చుట్టూ ఉన్నవారు అవాక్కయ్యారట.
ఈ సంఘటన గురించి పబ్ నిర్వాహకులు మాట్లాడుతూ రాజా, నవదీప్ అనే హీరోలతో కలిసి ముమైత్ తమ పబ్‌కు వచ్చిందని, వచ్చేటపుడు ముమైత్ బాగానే ఉందని తెలిపారు. అయితే పబ్‌లోకి రాగానే తాగడం మొదలుపెట్టిన ముమైత్ మత్తు తలకెక్కగానే సినీ ఇండస్ట్రీలో తనను మోసం చేసిన వారినందరిని బండ బూతులు తిట్టడం ప్రారంభించిందని తెలిపారు.
ఈ కసిలోనే ముమైత్ తన ఒంటిమీది బట్టలను సైతం పీకిపారేయటం మొదలుపెట్టిందనీ, ఈ పరిణామంతో పబ్ నిర్వాహకులు వెంటనే స్పంధించి ముమైత్‌ను ఆమె ఇంటివద్ద డ్రాప్ చేశారట. ముమైత్ నిర్వాకం చూశాక తాగితే ఎంతటివారైనా కంట్రోల్ తప్పుతారని అందరికీ తెలిసివచ్చిందట.