గుణశేఖర్ దర్శకత్వంలో ''సాధు''గా బాలకృష్ణ... ?
|
చాలా రోజుల క్రితమే ఈ చిత్రం ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటున్నా చిత్ర యూనిట్ మాత్రం వివరాలు బయటకు వెల్లడించలేదు. నిర్మాతగా ఎమ్.ఎస్. రాజు కెరీర్ కాస్త ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా ఈ చిత్రాన్ని సైలెంట్‌గా పూర్తి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం.
బాలకృష్ణ పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సాధు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. గతంలో రౌడీ ఇన్‌స్పెక్టర్, లక్ష్మీనరసింహా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన బాలకృష్ణ ఈ చిత్రంలో మరింత పవర్‌తో కనిపించనున్నారని తెలుస్తోంది.
అయితే ఈ చిత్రంలో ఎవరు హీరోయిన్లుగా నటిస్తున్నారు, ఇతరపాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయాలు నిర్ధారణ కావాల్సి ఉంది.
