'దస్ కా ధమ్' నిర్వాహకులపై సల్మాన్ అలక
|
అయితే సల్మాన్ మాత్రం ఈ ప్రోగ్రాం నిర్వాహకులపై సల్మాన్ మాత్రం కోపంగా ఉన్నాడట. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో వ్యాఖ్యాతగా ఉన్న తనకు నిర్వాహకులు ఇస్తున్న రెమ్యునిరేషన్ సరిపోలేదని సల్మాన్ అలకబూనాడట. తనవల్లనే ఈ ప్రోగ్రాంకు ఇంత గొప్ప పేరు వచ్చింది కాబట్టి తనకిస్తున్న పారితోషికాన్ని మరో 50శాతం పెంచాలంటూ సల్మాన్ డిమాండ్ చేస్తున్నాడట.
ప్రస్తుతం ఈ కార్యక్రమం కోసం ఆ టీవీ ఛానెల్ 104 ఎపిసోడ్లకు గాను సల్మాన్‌కు 89 కోట్లు చెల్లించినట్టు బాలీవుడ్ సమాచారం. అయితే ఈ మొత్తం తనకు సరిపోదని సల్మాన్ అంటున్నాడట. కానీ ఈ విషయంపై సల్మాన్‌గానీ కార్యక్రమం నిర్వాహకులు గానీ నోరు మెదపడం లేదు.

